సినీ నేపధ్య గాయనిగా సంస్కృతి
posted on Mar 21, 2016 4:18PM

ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకుడు డా. గజల్ శ్రీనివాస్ కుమార్తె సంస్కృతి సినీ నేపధ్య గాయనిగా పరిచయం కాబోతోంది. లలితా శ్రీ చిత్రాలయమ్స్ నిర్మిస్తున్న " అనుష్ఠానం" చిత్రానికి రసరాజు వ్రాసిన టైటిల్ సాంగ్ ని సంస్కృతి గానం చేయగా పి వి ర్ స్టూడియో లో రికార్డు చేసినట్టు చిత్ర దర్శకుడు మరియు సంగీత దర్శకుడు అయిన కృష్ణ వాసా తెలిపారు . సంస్కృతి 2005 నుండి తెలుగు లో గజల్ గానం చేస్తూ అమెరికా, కెనడా , సింగపూర్ , మలేషియా , గల్ఫ్ లాంటి దేశాలలో తన గజల్ ప్రదర్శన లతో ఎంతో పేరుతెచ్చుకున్నదని, తన తెలుగు గజల్ఆల్బమ్స్ బహుళ ప్రచారం పొందాయని 2013 లో నిర్వహించిన అంతర్జాతీయ బాలల చలనచిత్ర ఉత్సవాలలో " ఉత్తమ బాల మేధావి " అవార్డును స్వీకరించినదని తెలిపారు.