గ్యాస్ డీలర్ల నిలువుదోపిడీ..
posted on Sep 17, 2012 11:39AM

గ్యాస్ సిలెండర్ల పంపిణీపై కేంద్రం ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రతిపాదనింకా అమల్లోకి రానేలేదు..! అయినా.. కొన్ని గ్యాస్ కంపెనీలు మాత్రం ఇప్పటికే ఆరు సిలెండర్లు పూర్తయిన వినియోగదారులకు ఏడో సిలెండర్‌ను మార్కెట్‌రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి! ఈ విషయమై గ్యాస్ వినియోగదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ ఆంక్షలు అమలు కావంటూ స్పష్టంచేసింది. దీన్ని అతిక్రమించి ఎవరైనా ‘ఏడో సిలెండ్‌రు నిబంధన’ అమలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇందువల్ల ప్రభుత్వ ‘ఆంక్షల’ ప్రతిపాదనను అత్సుత్సాహంతో అమలు చేసేందుకు ప్రయత్నించే గ్యాస్ కంపెనీల యాజమాన్యాల దూకుడుకు కళ్ళెంపడినట్లయ్యిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.