ఆయన్ని సీఎంగా చేయడమే నా కల...
posted on Jun 2, 2017 11:49AM
.jpg)
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుశిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్లు జైలులో గడిపిన ఆయనకు గత ఏడాది బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇక అప్పటినుండి గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అంతేకాదు ఇటీవల తాను ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం గాలి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తానని.. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధమని తెలిపారు. అంతేకాదు ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని.. ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం తమ కల అని అన్నారు.