రైతులకు శుభవార్త.. 5 ఎకరాల లోపు భూమి ఉంటే ఉచిత బోరు

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ ఉచిత బోర్లు వేయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హత కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ లతో గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. ఒకవేళ అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతుతో కలిసి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, అప్పటికే బోర్లు ఉన్న పొలాలకు ఈ ఉచిత పథకం వర్తించదు.