అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవదహనం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు.   హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తమ పిల్లలతో పాటు ఇటీవల వెకేషన్‌ కోసం అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి సరదాగా అంట్లాంటా వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి తిరిగి డల్లాస్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.

వారు ప్రయాణిస్తున్న కారు గ్రీన్ కౌంటీ ప్రాంతానికి చేరుకున్నది. అక్కడ రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ట్రక్ వారు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొనడంతో   కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకట్, తేజస్విని, వారి ఇద్దరు పిల్లలూ సజీవదహనమయ్యారు. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వాళ్ల కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తహా తమ ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu