ఒంగోలులో 19 నుంచి ఈవీఎంల పరిశీలన.. ఈసీ గ్రీన్ సిగ్నల్
posted on Aug 10, 2024 11:06AM
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 12 పోలింగ్ కేంద్రాలపై వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఆయా కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలోని ఓట్లను రీకౌంటింగ్ చేయాలని కోరుతూ ఇందుకోసం జూన్ 10న ఆయన రూ.5,66,400 ఫీజుగా చెల్లించారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈవీఎంల పరిశీలనకు అంగీకరించింది. నిబంధనల మేరకు భెల్ ఇంజినీర్లతో డమ్మీ బ్యాలెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదు దారుల సమక్షంలో ఈ నెల 19 నుంచి 24 వకరకూ ఒంగోలులో బాలినేని ఫిర్యాదు చేసిన 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తారు.