బంగ్లాలో హిందువులపై దాడులు... హైదరాబాద్ అలర్ట్ 

నిన్న రిజర్వేషన్లతో అట్టుడికి బంగ్లాదేశ్ నేడు హిందువులపై దాడులతో అట్టుడికుతోంది. పలు దేవాలయాల మీద బంగ్లా ముస్లింలు దాడులు చేస్తున్న నేపథ్యంలో హైద్రాబాద్ అలర్ట్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ మతకలహాలు జరిగినా ఆ ప్రభావం హైద్రాబాద్ పై పడుతుంది. ఇప్పటికే పాతబస్తీలో అదనపు పోలీస్ బలగాలు మొహరించాయి. బంగ్లాలో శాంతిభధ్రతలు అదుపు తప్పడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకున్నారు. అభధ్రతా భావంలో ఉన్న ప్రజలు బెంగాల్ గుండా హైద్రాబాద్ లోకి చొరబడుతున్నట్టు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ కు సమాచారమందింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం బంగ్లాలో అధికారంలో ఉంది. కేవలం 8 శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. ఎక్కువగా కృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడ హిందువులు రోడ్డెక్కారు. మేమే ఈ దేశ ప్రజలమని నినదిస్తున్నారు. 170 మిలియన్లలో ఎనిమిది శాతం ఉన్న హిందువులు శాంతిని నెలకొల్పాలని నినదిస్తున్నారు. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు పలువురు ముస్లింలు రక్షణగా నిలిచారు. బంగ్లాదేశ్ నుంచి రోహ్యింగాలు ఎక్కువగా పాతబస్తీలో బస చేస్తున్నారు. వారికి ఆధార్ కార్డులు, వోటర్ కార్డులు కూడా వచ్చేశాయి. ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో రోహ్యింగాలు పాత బస్తీలో మకాం వేశారు.తాజాగా బంగ్లా నుంచి హిందువులు ఎక్కువగా హైద్రాబాద్ కు వచ్చే అవకాశాలున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ కు సమాచారమందింది. ‘‘హైదరాబాద్ లో అత్యంత పురాతన దేవాలయాలు ఉన్నాయి.  గంగా జమునా తెహజీబ్ కు హైదరాబాద్  ప్రతీక. లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో దేశానికే హైదరాబాద్  ఆదర్శం. మరీ ముఖ్యంగా ఇక్కడ  ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. హిందువుల పండుగల్లో ముస్లింలు.. ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. తాజాగాజరుగుతున్న అల్లర్లలో అక్కడ బంగ్లా ముస్లింలు హిందూ దేవాలయాలకు రక్షణ వలయంగా నిలిచారు. హైదరాబాద్ ముస్లింలు కూడా రక్షణగా నిలుస్తారు.  అల్లర్లు జరిగినప్పుడు  స్థానిక   ముస్లింలే వలయంగా నిల్చొని  గాజిబండ కామాక్షి దేవాలయాన్ని రక్షించిన విషయాన్ని  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, మానసిక నిపుణురాలు యమునాపాఠక్  గుర్తు చేశారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకురాలుగా కొనసాగుతున్న ఆమె హైద్రాబాద్ లో విద్వేషాలను రెచ్చగొట్టడం సరి కాదన్నారు. హిందువులు, ముస్లింలు కల్సి పండగలు చేసుకునే సాంప్రదాయం అనాదిగా  కొనసాగుతుందన్నారు. కష్ట సమయంలో హిందువులకు ముస్లింలు అండగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అండగా నిలుస్థారని యమునాపాఠక్ విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో మొహరింపు ఎక్కువయ్యింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News