బాద్ షా 50 రోజుల వేడుక లేనట్టేనా?
posted on Apr 17, 2013 2:09PM
.png)
బాద్ షా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తాజా చిత్రం ఇద్దరమ్మాయిలతో మే 9న విడుదల అవుతోంది. దాదాపు బాద్ షా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్. శ్రీనువైట్ల కాంబినేష లో వచ్చిన బాద్ షా చిత్రం మొదటివారంలోనే కలెక్షన్స్ పరంగా జోరు తగ్గిందని ట్రేడ్ వర్గాలు తెల్చేశాయి. కలెక్షన్స్ పరంగా ఓవర్సీస్ లో మాత్రం నెంబర్ వన్ గా నిలిచింది. బాద్ షా చిత్రం టాక్ వైజ్ గా హిట్, కలెక్షన్స్ పరంగా కమర్షియల్ సూపర్ హిట్ గా నిలిచింది. షాడో, గ్రీకువీరుడు వాయిదా పడడంతో బాద్ షా కి కలెక్షన్స్ వచ్చాయి. బాద్ షా నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రం 50 రోజులు పూర్తీ కాకుండానే ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని విడుదల చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారు. అసలు బాద్ షా చిత్రం 50 రోజుల వేడుక జరుగుతుందా అనే అనుమానాలు అభిమానులకు కలుగుతోంది.