TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Apr 20, 2025 8:43AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (ఏప్రిల్19) శ్రీవారిని మొత్తం 78 వేల 821 మంది దర్శించు కున్నారు. వారిలో 33 వేల  568 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 36 లక్షల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం (ఏప్రిల్ 20) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.