Top Stories

ఏపీలో మహిళా శక్తి పథకం.. ఉచిత బస్సు ప్రయాణానికి నో కండీషన్స్!

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ఉచిత‌ బ‌స్సు హామీ మేర‌కు తోలుగుదేశం ప్రభుత్వం  స్త్రీ శ‌క్తి  పేరుతో రాష్ట్రంలో ఉచిత బ‌స్సును ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం (ఆగస్టు15) సాయంత్రం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు  ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అయితే. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఈ ప‌థ‌కానికి సంబంధించి కొన్ని ష‌ర‌తులు విధించారు. వీటి ప్ర‌కారం  ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత స‌ర్వీసులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. ఇక‌, బ‌స్సులో ప్ర‌యాణించే స‌మ‌యంలో మ‌హిళ‌లు ఆధార్ స‌హా.. ఇత‌ర గుర్తింపు కార్డుల‌ను ఒరిజిన‌ల్‌వే చూపించాల‌ని కూడా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నిబంధనలతోనే స్త్రీ శక్తి పథకం శుక్రవారం (ఆగస్టు15) సాయంత్రం ప్రారంభమైంది. అ యితే శనివారం  శ‌నివారం ఉద‌యం నుంచి ఈ పథకాన్ని వినియోగించుకుని పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానకి ఉత్సాహం చూపారు. కానీ ఆ స‌మ‌యంలో చాలా మంది ఒరిజిన‌ల్ గుర్తింపు కార్డులు లేకుండానే బ‌స్సులు ఎక్కారు. కేవ‌లం జిరాక్సులు, లేదా ఫోన్ల‌లో ఉన్న డిజిట‌ల్ గుర్తింపు కార్డుల‌ను చూపించారు. నిబంధనల అనుమతించవంటూ.. వీటిని కండెక్ట‌ర్లు అంగీకరించలేదు. దీనితో  ఒరిజినల్ గుర్తింపు కార్డు నిబంధనను తొలగించాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు.   అలాగే ఘాట్ రోడ్ల‌లో ప్ర‌యాణించే బ‌స్సుల్లో ఉచితం లేద‌న్న విష‌యం తెలియ‌క‌.. మ‌న్యం,   పార్వ‌తీపురం, లోతుగ‌డ్డ, లంబ‌సింగి త‌దిత‌ర ప్రాంతాల్లో గిరిజ‌న మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలన్నీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి విధించిన నిబంధనలన్నీ దాదాపుగా తొలగించేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆదివారం ఉదయానికి ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక నుంచీ ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుంది. అయితే తిరుమల, అన్నవరం ఘాట్ రోడ్ల విషయంలో మాత్రం ఆయా ఆల యాల బోర్డులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇక  గుర్తింపు కార్డులు ఒరిజిన‌ల్‌ కండీషన్ ను కూడా ఎత్తివేశారు.  జిరాక్స్ కాపీల‌ను అనుమ‌తించాలని ఆదేశించారు.   దీంతో మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల‌ను దాదాపు తీసేసిన‌ట్లైంది.
ఏపీలో మహిళా శక్తి పథకం.. ఉచిత బస్సు ప్రయాణానికి నో కండీషన్స్! Publish Date: Aug 17, 2025 9:08PM

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. ఇన్ని రోజులుగా మోడీ, షా ల ఛాయిస్ ఎవరు అన్న విషయంలో నెలకొన్న ఆసక్తి, సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆదివారం (ఆగస్టు 17) జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం రాధాకృష్ణన్ ను ఎన్డీయే కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న   రాధాకృష్ణన్  గతంలో జార్ఖండ్, పాండిచ్చేరి గవర్నర్ గా కూడా పని చేశారు. కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ కోయంబత్తూర్ నుంచి రెండు సార్లు లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వెంకయ్యనాయుడు తరువాత దక్షిణాదికి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరఫున ఎంపికైన రెండో వ్యక్తి రాధాకృష్ణన్.
ఎన్డీయే ఉప రాష్ట్రపతి  అభ్యర్థిగా రాధాకృష్ణన్ Publish Date: Aug 17, 2025 8:47PM

ఎడారి దేశంలో ఏడేళ్ల నరకం.. సీఎం ప్రవాసి ప్రజావాణి చొరవతో స్వదేశానికి

ఏడేళ్ల ఎడారి జీవితం... నరకయాతన నుంచి ఎట్టకేలకు విముక్తి చెందిన తెలంగాణ వ్యక్తి ఉదంతమింది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఏడేళ్ళుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు.  నీ వొడిలోకి వస్తాను తల్లీ... నన్ను సల్లంగ దీవించు తల్లీ... అంటూ మాతృభూమిని తలుచుకుంటూ  సొంతగడ్డకు రావాలని తహతహలాడాడు.     మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో... ఎడారిలో అతను పడ్డ ఏడేళ్ల నరకయాతనకు తెర పడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన ఆ తెలంగాణ వలస జీవి, మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్ కు ఆదివారం (ఆగస్టు 17) చేరుకున్నారు.  గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నివశించే, కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకుడు మహ్మద్ జబ్బార్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి ఈశ్వర్ సౌదీ నుంచి సొంతగడ్డకు రావడానికి  మార్గం సుగమం చేశారు. సౌదీ నుంచి స్వగ్రామానికి వెళ్లే ఆనందంలో,  భావొద్వేగంతో గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు అంకితం చేశారు.   ఏడున్నవే నా పల్లే... నువ్వు ఏడున్నవే నా తల్లీ!  బతుకు దెరువు కోసం బాట పట్టినా...  పొట్ట తిప్పల కోసం సౌదీ కొచ్చినా!  నెలలు గడిచిపాయే, ఏండ్లు గడిచిపాయే, ఏడేండ్ల పొద్దాయే...  ఎండిపోయిన రొట్టె నేను తినుకుంటా...  నాచుగట్టిన నీళ్లు నేను తాగుకుంటా...  కారండ అడవిలో గొర్ల కాసుకుంటా...  నేను కాలమెల్లదీత్తి తల్లీ..  నేను కడుపు గట్టుకుంటి తల్లీ!   నీ వొడిలోకి వస్తాను తల్లీ... నన్ను సల్లంగ దీవించు తల్లీ!  అంటూ సౌదీలోని తన ఏడేళ్ల కష్టాన్నీ, కన్నీళ్లనూ అక్షరాలుగా మార్చి రాసి, పాడిన పాటను తనను సొంతగడ్డకు తీసుకురావడానికి సహకరించిన అధికారిణికి అంకితం ఇచ్చాడు.  అసలు ఈశ్వర్ సౌదీ యానం.. అక్కడి కష్టాలు.. ఏడేళ్ల నరకయాతన ఎలా మొదలైందంటే..  2017 ప్రారంభంలో హౌస్ డ్రైవర్‌గా పని చేసిన ఈశ్వర్, కొద్ది నెలలకే ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఏడేళ్లు గడిపాడు.  ఈశ్వర్ భార్య తాళ్లపల్లి లత, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణి  కౌంటర్ లో  ముఖ్యమంత్రి  వంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల పేరిట 2025 జూన్ 27న వినతిపత్రం అందజేశారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి స్వయంగా వెంట ఉండి వారికి మార్గనిర్దేశనం చేశారు. సీఎం ప్రజావాణి  నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్, ఈశ్వర్ ను స్వదేశానికి రప్పించే విషయంలో ప్రత్యేక చొరవ చూపారు.   ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగం ద్వారా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాయించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వీరందరి కృషీ ఫలించింది. ఈశ్వర్ కు సౌదీలో కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది. సొంత గడ్డకు చేరే అవకాశం లభించింది.
ఎడారి దేశంలో ఏడేళ్ల నరకం.. సీఎం ప్రవాసి ప్రజావాణి  చొరవతో స్వదేశానికి Publish Date: Aug 17, 2025 12:21PM

ప్రధానిగా మోడీ కొనసాగుతారా? ఆర్ఎస్ఎస్ కరుణ చూపుతుందా?

మోడీ రిటైర్మెంట్ పై సాగుతున్న చర్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి చేపట్టిన ఓటు చోరీ ఆందోళన నేపథ్యంలో మరో సారి మరింత బలంగా మోడీ రిటైర్మెంట్ చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ రిటైర్మెంట్  అంశాన్ని వార్తలో నిలిచేలా పదే పదే ప్రస్తావిస్తూ సవాళ్లు విసురుతోంది. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీల విషయంలో  మోడీ, షా వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ.. 75 ఏళ్ల నిబంధన నుంచి మోడీకి మినహాయింపు ఏమైనా ఉందా? అంటూ ఎద్దేవా చేస్తోంది.  వచ్చే నెలతో అంటే సెప్టెంబర్ తో సెప్టెంబర్‌తో మోదీకి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. దీంతో బీజేపీ తనంతట తానుగా విధించుకున్ననిబంధన ప్రకారం మోడీ రిటైర్ కావలసి ఉంటుంది.  బీజేపీ పొలిటికల్ మెంటార్ లాంటి ఆర్ఎస్ఎస్ కూడా అదే చెబుతోంది. అయితే పార్టీలోనే మోడీ రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చను తెరపైకి తెస్తున్నవారిలో  మోడీ ప్రధానిగా కొనసాగాలనుకుంటున్న వారితో పాటు ఆయన వైదొలగాలని కోరుకుంటున్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ కూడా మోడీ ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాల కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు చేస్తున్నది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత  జైరాం రమేశ్‌   మోదీ పదవీకాలం సెప్టెంబర్‌ తర్వాత కొనసాగడం అన్నది ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.     బీజేపీ విధాన నిర్ణయాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకమన్నది బహిరంగ రహస్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు లేకుండా మోదీ 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయింపు పొందే అవకాశం ఇసుమంతైనా లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఈ నేపథ్యంలోనే మోడీ ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుడ్ లుక్స్ లో పడేందుకు మోడీ శతధా ప్రయత్నిస్తున్నారనడానికి ఆయన ఇటీవలి ప్రసంగాలలో ఆర్ఎస్ఎస్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్న విధానమే తార్కనంగా పరిశీలకులు చెబుతున్నారు.    గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించడంలో  ఆ ఎన్నికల ప్రచారాన్నంతా భుజాలపై వేసుకుని మోసిన మోడీ వైఫల్యం ఆయనను బీజేపీలో బలహీన నేతగా మార్చిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని పదవిలో 75 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా కొనసాగాలంటే ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడం వినా మరో మార్గం లేదనీ, అందుకే మోడీ ఆ ప్రయత్నాలలో మునిగిపోయారని చెబుతున్నారు.  గత దశాబ్ద కాలంగా బీజేపీని బలమైన నాయకత్వంతో ముందుకు నడిపించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు బలాన్ని కోల్పోయారనీ, గత ఎన్నికలలో పార్టీకి మెజారిటీ సీట్లు సాదించడంలో ఆయన వైఫల్యం ఇప్పుడు ఆయన ముందరి కాళ్లకు బంధంగా మారిందనీ చెబుతున్నారు. ఇక ఆయన సెప్టెంబర్ తరువాత ప్రధానిగా కొనసాగడమన్నది ఆర్ఎస్ఎస్ కరుణాకటాక్షాలపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆర్ఎస్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో? 
ప్రధానిగా మోడీ కొనసాగుతారా? ఆర్ఎస్ఎస్ కరుణ చూపుతుందా? Publish Date: Aug 17, 2025 12:03PM

ఓట్ల చోరీ.. భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు?

భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన, ఆరోపణలకు బలం చేకూరుతోంది.  బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు  భారత ఎన్నికల కమిషన్ పనితీరుపై సందేహాలను లేవనెత్తుతోంది. బీహార్ ఓటర్ల జాబితా లో 65 లక్షల మందిని తొలగించారని,ఎన్నికల సంఘంతో ప్రభుత్వం కుమ్మక్కైందని పార్లమెంటులో 15 రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించినట్లు ఆరోపిస్తున్న 65 లక్షల ఓటర్ల పేర్లు, వివరాలను 48 గంటల్లో అధికారిక వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది. తొలగించడానికి కారణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టు  ఆదేశాలు ఎన్నికల కమిషన్ ను షాక్  అనే చెప్పాలి. ఓటర్ల సవరణ పేరుతో తొలగించడం అక్రమమని కాంగ్రెస్ సహా  ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.   సుప్రీంకోర్టు జోక్యం తో ఓట్ల చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయా, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవాలు తేలతాయా అంటే ఇతమిథ్ధంగా చెప్పలేమన్నది విశ్లేషకుల మాట.  త్వరలో బీహార్ ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై ఇలాంటి అక్రమానికి పాల్పడిందన్నది కాంగ్రెస్, ఇండియా కూటమి ఆరోపణ.  ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న విడుదల చేసింది. దాని ప్రకారం 65.6 లక్షల ఓటర్ల పేరు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లలో తొలగించింది 9 శాతం. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. అలాగే గత (2020 ఎన్నికలు), 2024 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. 1977 తరువాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. సగటున ఇదే 9 శాతం దేశవ్యాప్తంగా పరిగణలో తీసుకుంటే 9 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి.   ఈ సంఖ్య బ్రిటన్ లోని ఓటర్ల సంఖ్యకు ఒకటిన్నరెట్లు అధికం.  బీహార్లో 30 లక్షల ఓటర్లు అర్హత ఉండి కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్రించుకోలేకపోయారన్నది వాస్తవం.   ఓటర్ల జాబితా లో మృతిచెందారని పేర్కొన్న వారితో ఫోటోలు దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.   మృతులతో ఫోటోలు దిగే భాగ్యం కల్పించినందుకు కృతజ్ణతలు అంటూ ఆయన వ్యంగ్యంగా చేసిన పోస్టు హాట్ ను మరింత పెంచేసింది.  మరణించారంటూ ఓటరు జాబితా నుంచి తొలగించిన వారితో ఆయన చాయ్ తాగుతూ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమలో పోస్టు చేశారు.  ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు 300 మంది పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకూ ఓట్ల చోరీ నినాదంతో భారీ ప్రదర్శన చేసారు. ఈ ప్రదర్శనలో ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,  రాహూల్, ప్రియాంకగాంధీ సహా   పలువురి అరెస్టు చేశారు.  తమది రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని, ఓటర్ల చోరీ ఉద్యమం మహోద్యమం గా మారుతుందనడంలో సందేహంలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఓట్ల చోరీ జరిగిందని ప్రామాణిక పత్రంపై సంతకం చేసి ఇస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలా చేయకపోతే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రాహుల్ ఆరోపణలపై కర్ణాటక,హర్యానా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసారు. రాహుల్ లేవనెత్తిన అంశానికి  ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకుండా ప్రమాణాలు చేయ్యాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మోడీ హయాంలో సందేహాలకు తావిచ్చేదిలా ఉందనడంలోసందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు  మోదీ హయాంలో ఎన్నికల కమిష న్ ను  నిర్వీర్యం చేసారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. శేషన్ హయాంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఎలా ఉండవచ్చో చూపించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్  వెన్నెముక లేని సంస్థగా మారిపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను సామాన్యులు సైతం సమర్ధిస్తున్నారు.  బీహార్ లో ఓటర్ల తొలగింపు అంశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటంతో భారత ఎన్నికల సంఘం, కేంద్రంలోని మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడ్డాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.  ఇక తాజాగా తొలగించిన ఓటర్ల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్షాల వాదన సరైనదేన్న భావన సర్వత్రా కలిగేలా చేశాయి.   
ఓట్ల చోరీ.. భారత ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు? Publish Date: Aug 17, 2025 11:09AM

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విషాద దృశ్యాలు ఇంకా మరపునకు రాలేదు. అంతలోనే మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. వరుసగా విమానాలలో సాంకేతిక సమస్యలు, ఎమర్జెన్సీ ల్యాండింగులతో విమానయానమంటేనే ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్న వేళ ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది. వివరాల్లోకి వెడితే ముంబై విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానం ల్యాండ్ అడుతుండగా విమానం వెనుక భాగం రన్ వేను బలంగా ఢీ కొంది. అయితే పైలట్ల చాకచక్యం వల్ల ఘోర ప్రమాదం తృటిలో తప్పి విమాన ప్రయాణీకులు సురక్షింగా ఉన్నారు.  ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.  బ్యాంకాక్ నుంచి 6ఇ 1060 నంబర్ గల ఇండిగో ఎయిర్‌బస్ ఏ321 నియో విమానం శనివారం  ముంబై చేరుకుంది. ఆ సమయంలో  భారీ వర్షం కురుస్తున్నది.  ఉదయం 3:06 గంటలకు రన్‌వే 27పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కు అవకాశం లేదని భావించిన పైలట్లు విమానాన్ని  తిరిగి పైకి లేపే ప్రయత్నంలో విమానం తోక భాగం  రన్‌వేకు తగిలింది. దీంతో పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.  కాగా ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది.  ప్రతికూల వాతావరణం కారణంగా గో-అరౌండ్ చేస్తున్నప్పుడు విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం, విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు నిర్వహించి, రెగ్యులేటరీ అనుమతులు పొందాకే తిరిగి సేవలు ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది.  
తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం Publish Date: Aug 17, 2025 9:27AM

రేపటి నుంచి రాహుల్‌ గాంధీ ఓటు అధికార్‌ యాత్ర

  లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ  ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు.  ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ  బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు ప్రతిపక్ష నాయకుడు  రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు.  దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో  ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటర్లను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల హక్కుల యాత్రను చేపడుతున్నారు. ఆయన ప్రజా కోర్టుకు చేరుకుని, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలంటే, ఇక్కడి ఓటర్లను బలోపేతం చేయాలని ప్రజలకు చెబుతారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణకు వ్యతిరేకంగా, ఓటర్ల చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి యాత్ర జరుగుతోందని కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ తెలిపారు  
రేపటి నుంచి రాహుల్‌ గాంధీ ఓటు అధికార్‌ యాత్ర Publish Date: Aug 16, 2025 8:51PM

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి

  తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి  వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 29.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.  
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి Publish Date: Aug 16, 2025 8:32PM

ఆధార్ కార్డు చూపించినా..కండక్టర్‌ల అత్యుత్సాహం

  ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కండక్టర్‌లు  అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్  కార్డునే చూపించాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాక్స్ ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు అంటున్నారు. దీంతో కండక్టర్‌ల తీరు మహిళల అసహనం వ్యక్తం చేస్తున్నారు .మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చుని ప్రభుత్వం చెబుతుంటే కండక్టర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఉచితం లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్‌ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి  వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది.  
ఆధార్ కార్డు చూపించినా..కండక్టర్‌ల అత్యుత్సాహం Publish Date: Aug 16, 2025 7:54PM

ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు నమోదు.. జైషే మహ్మద్‌తో లింకులు

  శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌పై  పోలీసులు దేశద్రోహం కేసునమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్ర సంస్థలతో మహమ్మద్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరోవైపు ధర్మవరం టెన్ పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ఎర్రగుంట్లు వాసి రియాజ్ నో ఇండియా ఐ లవ్ పాకిస్థాన్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఓ హోటల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొన్నాది.నూర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో నూర్‌ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్‌ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే..  నూర్‌ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్‌ను లోకల్‌ పోలీసులే మొదట అరెస్ట్‌ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన.  ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్‌ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్‌లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.
ధర్మవరం వాసిపై  దేశద్రోహం కేసు నమోదు.. జైషే మహ్మద్‌తో లింకులు Publish Date: Aug 16, 2025 6:17PM

ఇంతకీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు ఎప్పుడంటే?

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను కూటమి పార్టీలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు అప్పగించాయి. దీంతో మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారన్నది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కడం లేదు. రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నా.. మోడీ షాల మదిలో ఎవరున్నారన్నది ప్రకటన వెలువడే వరకూ ఎవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ సస్పెన్స్ ఒక్క కూటమి పార్టీలలోనే  కాదు కాంగ్రెస్ లో కూడా ఉంది. ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది తేలిన తరువాత కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? ఒక వేళ నిలబెడితే ఎవరిని అన్నది తేల్చుకునే అవకాశం ఉంది.   ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 17) జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎవరన్నది తేలుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరిశీలకులు మాత్రం  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో  అభ్యర్థిని ఖరారు అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగుతుందనీ, అయితే అభ్యర్థి ఎంపిక బాధ్యత మాత్రం మళ్లీ మోడీ, షాలకు అప్పగిస్తుందనీ అంటున్నారు. ఇక మోడీ, షా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సోమవారం (ఆగస్టు 18)న ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి దన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవిని చేసిన రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి.  అయితే ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంత వరకూ జరగలేదు.  అయితే ఈ సస్పెన్స్ మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదు. ఉపరాష్ట్రపదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ కావడంతో సోమ, లేదా మంగళవారం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్ని పేర్లు తెరమీదకు వచ్చినా ఫైనల్ గా అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే అనడంలో సందేహం లేదు.  
ఇంతకీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు ఎప్పుడంటే? Publish Date: Aug 16, 2025 5:20PM

రోడ్డు ప్ర‌మాదానికి గురైన కారులో 16 కిలోల గంజాయి ల‌భ్యం

  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బాట‌సింగారం వ‌ద్ద ఓ కారు ప్ర‌మాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు  ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇక కారును ప‌రిశీలించ‌గా, అందులో గంజాయి ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌హ‌బూబాబాద్‌కు చెందిన భూక్యా నాయ‌క్ ఒడిశా నుంచి మ‌హారాష్ట్ర‌కు గంజాయి త‌ర‌లిస్తుండ‌గా బాట‌సింగారం వ‌ద్ద‌ కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో గంజాయి బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. 16 కేజీల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యానాయ‌క్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  
రోడ్డు ప్ర‌మాదానికి గురైన కారులో 16 కిలోల గంజాయి ల‌భ్యం Publish Date: Aug 16, 2025 5:17PM

ఓటు ఎవరికి వేసినా గెలిచేది బీజేపీనే..ఎంపీ అరవింద్ వీడియో వైరల్

  దేశంలో ఓట్ చోరీ తీవ్ర దుమారం రేపుతున్న వేళ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీరు ఎవరికి ఓటు వేసిన గెలిచేది బీజేపీనే అంటూ గతంలో అరవింద్ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు నోటాకు ఓటు వేసినా తానే గెలుస్తానని..మీరు కారు గుర్తుకు ఓటు వేసినా తానే గెలుస్తానని అప్పుట్లో అరవింద్ వెల్లడించారు. మీరు ఎవరికి ఓటు వేసినా రాబోయేది మోదీనే అంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేపుతోంది.జాతీయ ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై భారీ ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతున్నదంటూ లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా తప్పుపడుతోంది.  ఈ విషయంలో కాంగ్రెస్ ఇక యుద్ధమేనని ప్రకటించింది. ప్రచారానికి వెబ్‌పోర్టల్‌ను సైతం ప్రారంభించి అందులో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది.  నిజానికి అర్వింద్ మాట్లాడిన ఈ వీడియో 2023 ఆగస్టుకు సంబంధించినది అని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఓటర్ల జాబితా, ఈవీఎంల కాంట్రవర్సీ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో అర్వింద్ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలిచిందనడానికి అర్వింద్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నాయి.  
 ఓటు ఎవరికి వేసినా గెలిచేది బీజేపీనే..ఎంపీ అరవింద్ వీడియో వైరల్ Publish Date: Aug 16, 2025 4:32PM

ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి?

ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మరో నాలుగైదు రోజుల్లో అంటే  ఆగష్టు 21తో నామినేషన్ల గడువు, ముగుస్తుంది. అయినా.. అధికార విపక్ష  కూటమి అభ్యర్ధులు ఎవరన్నది ఇంకా  తేలలేదు. అధికార ఎన్డీయే కూటమిలో అభ్యర్ధి ఎవరన్నది మాత్రమే తేలవలసి వుంది. కానీ.. విపక్ష ఇండియా కూటమి అయితే..  అసలు పోటీ చేస్తుందా? లేక ఎటూ ఓటమి తప్పదు కాబట్టి పోటీకి దూరంగా ఉంటుందా? అన్న విషయంలో ఇంత వరకూ స్పష్టత లేదు. అయితే..  కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  అయితే..  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా  ఇడియా కూటమి అభ్యర్ధిని బరిలో దించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.   నిజానికి ఇటీవల రాహుల్ గాంధీ నూతన అధికార నివాసం బంగ్లా నెంబర్ 5 , సునేహ్రీ బాగ్ లో  ఇండియా కూటమీ నాయకులకు విందు ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జన ఖర్గే, కూటమి కీలక నేతలు   శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాకరే, కనిమొళి సహా ఇంచుమించుగా   40 మంది వివిధ పార్టీల ముఖ్యనాయకులు  హజరైన ఈ విందు సమావేశంలో..   ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇండియా కూటమి పోటీ చేసే విషయంపైనే  ప్రధానంగా  చర్చించినట్లు తెలుస్తోంది.  కూటమి ఐక్యతను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని నిలబెట్టాలనే విషయంలో సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే.. కూటమి అభ్యర్ధి విషయంలో మాత్రం ఎలాంటి చర్చ జరగలేదనీ.. అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎవరన్నది తేలిన తర్వాత, మరోమారు అభ్యర్ధి విషయం చర్చిద్దామని ఇండియా కూటమి నేతలు  నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   అదలా ఉండగా..  అధికార  ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు  అప్పగించిన నేపధ్యంలో   ఆదివారం (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో  ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా చేయగా,  కేంద్ర ఎన్నికల సంఘం  నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆగష్టు 8 న ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకవేళ ఎన్నికకు పోటీ జరిగితే..  సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పార్లమెంట్ హౌస్ మొదటి అంతస్తులో పోలింగ్ జరుగుతుంది.  కాగా..  ఇండియా కూటమి సీరియస్ గా ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడం ఇంచుమించుగా ఖారారు అయిన నేపధ్యంలో  ఉపరాష్ట్రతి ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. అయితే  ఎలా చూసిన కూడా  ఎన్డీఎదే పైచేయి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.  ప్రస్తుత లెక్కల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో(నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. వాటిలో  5 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఒక లోక్ సభ  సీటు ఖాళీగా ఉంది. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427  (293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87  మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి. అలాగే..  ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య  సుమారు 30 వరకు ఉంటుంది.  సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైనా..  ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో  ఇండియా కూటమి? Publish Date: Aug 16, 2025 4:13PM

వ్యాయామం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ

  యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండడమే కాకుండా... ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటూ ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచిస్తున్నారు. ఒకవైపు తన ప్రసంగంతో ప్రజల్ని ఆకర్షిస్తూనే... మరోవైపు ప్రతిరోజు ఎక్సైజ్ చేస్తూ యువతకు ఓవైసీ ఆదర్శంగా నిలిచారు.  ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని తాడ్ బన్ ప్రాంతంలో ఓ వ్యక్తి జిమ్ పెట్టాడు. ఈ జిమ్ ప్రారంభోత్సవానికి అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం ఓవైసీ ఎక్ససైజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అసదుద్దీన్ ఓవైసీ కి జిమ్ చేయడంలో ప్రావీణ్యం ఉంది... అయితే ఓవైసీ జిమ్ చేస్తున్న సమయం లో ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా  మారి చక్కర్లు కొడుతుంది.
వ్యాయామం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ Publish Date: Aug 16, 2025 3:59PM

అమెరికాకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు బయలుదేరారు. పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయల్దేరిన ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులో భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండాఫ్ ఇచ్చారు. చిన్న కుమారుడని కాలేజీలో చేర్పించేందుకు వెళ్లున్నా కవిత 15రోజులు పాటు అక్కడే ఉండనున్నారు.మళ్లీ కవిత సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.  నిన్న ఎర్రవళ్లి ఫామ్ హౌస్‌లో నిన్న కవిత, కేసీఆర్ కలిసేందుకు వెళ్లారు. అయితే గులాబీ బాస్ కూతురితో మాట్లాడలేదని సమాచారం. ఇంటి ప్రధాన ద్వారం వద్దే ఆమె ఉండిపోగా..కేసీఆర్, ఆర్యను తన గదికి పిలిపించుకొని 10 నిమిషాల పాటు మాట్లాడి, ఆశీర్వదించి పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫామ్ హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, హారీశ్‌రావు ఇతర నేతలు కవితతో మాట్లాడలేదని సమాచారం.
 అమెరికాకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత Publish Date: Aug 16, 2025 3:35PM

పులివెందులలో రిగ్గింగ్ అంటూ అంబటి ఫేక్ వీడియో.. నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా

అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు వైసీపీకి అలవాటే. దొరికిపోయిన ప్రతిసారీ నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఆ పార్టీ నేతలకు కొత్తేం కాదు. అధికారంలో ఉన్నప్పటి నుంచీ కూడా వైసీపీ చేస్తున్నది ఇదే. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు, దుష్ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోతో చెలరేగిన తీరు సామాన్య జనానికి కూడా వెగటు పుట్టించింది. గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి  ఈ తీరు కూడా ఒక కారణమనడంలో సందేహం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి, కనీసం విపక్ష హోదా లేని పరిస్థితుల్లో కూడా మళ్లీ పుంజుకోవాలంటూ ఫేక్ తీరు శరణ్యమని వైసీపీ భావిస్తున్నట్లు ఉంది. అయినా గత ఎన్నికలలో ఓటమి కంటే ఘోరమైన పరాజయం ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎదురైంది. సహజంగానే ఈ ఓటమి వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ నేతలు, శ్రేణుల నైతిక స్థైర్యం పాతాళానికి పడిపోయింది. ఓటమిని జీర్ణించుకోలేక కక్కలేకా, మింగలేకా అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఉంది. రిగ్గింగు, అరాచకాలు అంటూ అధికార తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది. కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా పులివెందుల జడ్పీటీసీలో ఎదురైన ఓటమికి ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.   ఈ నేపథ్యంలోనే  మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పులివెందులలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన ఆరోపణలకు రుజువిదిగో అంటే ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే ఆయన ఇలా ఆ వీడియో పోస్టు చేసి పులివెందుల రిగ్గింగ్ కు సాక్ష్యం అన్నారో.. ఆ క్షణం నుంచీ నెటిజనులు అంబటిపై ఓ రెంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంబటిగారూ పులివెందులలో పోలింగ్ జరిగితే.. పశ్చిమబెంగాల్ లో రిగ్గింగు అంటారేంటండీ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  ఇంతకీ విషయమేంటంటే.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగుకు రుజువిదుగో, తెలుగుదేశం పులివెందుల జడ్పీటీసీ ఎన ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడిందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా అంటూ అంబటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఓ ఫేక్ వీడియో.  పశ్చిమ బెంగాల్ లో గతంలో ఎప్పుడో జరిగిన పోలింగ్ కు సంబంధించిన వీడియో.. దానిని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిందేనని నమ్మబలుకుతూ అంబటి రెచ్చిపోయారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆయన బండారం బయటపడిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురయ్యారు పాపం.  ఇంతకీ అంబటి నకిలీ గుట్టు ఎలా బయటపడిందో తెలుసా? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఉపయోగించిన గులాబి రంగు బ్యాటెల్ పత్రాలు. కానీ అంబటి షేర్ చేసిన వీడియోలో పసుపు రంగు బ్యాటెల్ పత్రాలు కనిపించాయి. తెలుగుదేశం జెండా రంగు పసుపు కదా.. అంతా నమ్మేస్తారని భ్రమించినట్లున్నారు అంబటి.  ఆ భ్రమలు పటాపంచలైపోవడమే కాదు..పులివెందులలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనీ, అక్రమాలకు రుజువులు చూపడం చేతకాకే నకిలీలపై పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందులలో రిగ్గింగ్ అంటూ అంబటి ఫేక్ వీడియో.. నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా Publish Date: Aug 16, 2025 3:32PM

సరోగసి కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు

  సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే..మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళలను అంగట్లో సరుకుల మార్చి అమ్మత నాన్ని అమ్ముకుంటు న్నారు.అమాయకమైన మహిళలను టార్గెట్ చేసుకొని వారి దందా కొనసాగిస్తూ లాభాలు గడిస్తున్నారు.ఇప్పడు తాజాగా మేడ్చల్ కేంద్రంగా చేసుకొని అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్న కిలాడి ఎస్ఓటి బృందం చేతికి చిక్కిన విషయం తెలిసిందే... ఈ కేసులో సంచలన మైన విషయాలు  బయటపడుతున్నాయి. నిన్న ఎస్ఓటి బృందం మేడ్చల్ జిల్లా పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సరోగసి దందా కొనసాగిస్తున్న నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  అంతేకాకుండా పోలీసులు సరోగసి తల్లులకు నోటీ సులు కూడా పంపించారు. అయితే నింది తురాలు లక్ష్మి గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి తన కుమారుడు నరేందర్ రెడ్డి మరియు కూతురు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు... నగరాన్నికి వచ్చిన నిందితురాలు లక్ష్మి మళ్ళీ అదే దందా కొనసాగించింది. లక్ష్మి పలు ప్రవేట్ హాస్పిటల్స్ మరియు ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది ఎవరైనా దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లల కోసం హాస్పటల్స్ సెంటర్లను ఆశ్రయించగా వాళ్ల ఏజెంట్లు లక్ష్మికి సమాచారం ఇస్తారు. ఆ విధంగా లక్ష్మి  ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్ల దంపతుల వివరాలు ఏజెంట్ల ద్వారా సేకరించేది. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బలవం తంగా సరోగసికి ఒప్పించేది. ఆ తర్వాత పిల్లల కోసం తాపత్రయం పడుతున్న దంప తులను టార్గెట్‌గా చేసుకొని... వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి 20 నుండి 25 లక్షల వరకు డబ్బులు వసూలు చేసేది. కానీ సరోగసి తల్లులకు మాత్రం ఐదు నుండి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చేది. అంతేకాకుండా నిందితురాలు లక్ష్మి సరోగసి తల్లులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ బాండ్ రాయించు కునేది.  ఇలా ఇప్పటివరకు ఎనిమిది మంది సరోగసి తల్లుల చేత ప్రామిసరీ బాండ్ రాయించుకున్నది. ఇప్పుడు పోలీసులు వారందరికీ నోటీ సులు జారీ చేశారు. లక్ష్మి మరియు ఆమె కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేసి... ఇంట్లోఉన్న  ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు  గర్భాదారణ మందులు  హార్మోన్ ఇంజక్షన్లు లతో పాటు  హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్ ,ఫర్టి కేర్ ,శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన కొన్ని రిపోర్ట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు పలు ఐ వి ఎఫ్ హాస్పిటల్స్ తో లక్ష్మి కి ఉన్న సంబంధాల పై ఆరా తీస్తున్నారు.
సరోగసి కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు Publish Date: Aug 16, 2025 3:10PM

యూరియా కోసం రైతుల పడిగాపులు

  యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పీఏసీఎస్‌ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో తెల్లవారు జామునుండే పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ టోకెన్లు ఇస్తుండటంతో గందర గోళం నెలకొంది. యూరియా నిలువలు తక్కువగా ఉండటంతో తమదాకా అందుతాయోలేదోనంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.  రాత్రి రెండు గంటల నుండే యూరియా కోసం లైన్ లో నిల్చున్నామని చెబుతున్న మహిళా రైతులు  యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్‌ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్‌ డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. కిలోమీటర్ పొడవునా క్యూ లైన్ లో రైతులు ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్‌లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరు. ఒక్కో బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నారు.యూరియా పంపిణి కోసం గూడూరు సీఐ, గూడూరు ఎస్సై, 20 మంది పోలీసులు పహారా కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్  గూడూరు పిఏసిఎస్ కు చేరుకొనున్నారు.  దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.ప్రస్తుతం గూడూరు లో హై టెన్షన్ నెలకొంది.
యూరియా కోసం రైతుల పడిగాపులు Publish Date: Aug 16, 2025 2:55PM

చందానగర్ జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి

  హైదారాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీకి ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో చోరీకి వచ్చి దొంగతనం తర్వాత నంబర్ ప్లేట్లను మార్చుకున్నారని, 10 కేజీల వెండి ఆభరణాలు దోపిడీ చేశారని డీసీపీ తెలిపారు. ఈ బీహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇదేనని, గతంలో కోల్‌కత్తా, బీహార్, కర్ణాటకలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు.  ఈ ఏడుగురు బీహార్ కి చెందిన వ్యక్తులని పేర్కొన్నారు. వీరిపై ఆ రాష్ట్రంలో  4, 5 కేసులు నమోదు అయ్యాయి. ఒక నిందితుడి పై 10 కేసులు ఉన్నాయిని డీసీపీ తెలిపారు.20 రోజుల క్రితం నగరానికి వచ్చారని  ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహా అనే ఇద్దరు నిందితులను పూణేలో అరెస్ట్ చేశామని తెలిపారు.చోరీ జరిగిన 24 గంటలలో నిందితులను గుర్తించామన్నారు. బీహార్ నుండి వెపన్స్ కొనుగోలు చేశారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు
చందానగర్ జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి Publish Date: Aug 16, 2025 2:39PM

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నిక

  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సంఘ సభ్యులంతా చిన్నిని ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించారు. అయితే, ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆయనే మరోసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ACA ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఏసీఏ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు.. మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది.గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు  
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నిక Publish Date: Aug 16, 2025 2:18PM

క‌డ‌ప రెడ్డెమ్మ కుర్చీలాట‌

రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి రెడ్డి అంటే అదో బ్రాండింగ్ అన్న‌ట్టు..  స్టేజి మీద చేరి క‌న్ను గీటినా.. తనకు కుర్చీ వేయ‌లేదు   అంటూ మైకు గిరాటేసినా.. ఆమెకే చెల్లిందని అంటారు.  ఆమె మాజీ మంత్రి రెడ్డెప్ప‌గారి రాజ‌గోపాల్ రెడ్డి కోడ‌లు, కాంట్రాక్ట‌ర్ శ్రీనివాసులు రెడ్డి స‌తీమ‌ణి. అంతే కాదు ఎంఏ వ‌ర‌కూ చ‌దివిన విద్యావంతురాలు కూడా. కానీ ఆమె కుర్చీ ప్రొటోకాల్ విష‌యంలో మాత్రం ఒక్క‌సారిగా చిన్న‌పిల్ల‌లా మారిపోతారని చెబుతారు. అదేదో సినిమాలో ఒక  కేరెక్ట‌ర్.. నాకు బ‌ర్త్ డే కేక్ పెట్ట‌లేదు నున్వు! అంటూ గొడ‌వ చేసే పాత్రలా ఉంటుందామె తీరు. మొన్న 2024లో మున్సిప‌ల్ స‌ర్వ స‌భ్య స‌మావేశంలో  కూడా కుర్చీ వేయ‌లేదంటూ నానా ర‌భ‌స చేశారు రెడ్డెప్ప‌గారి మాధ‌వీరెడ్డి. ఇక్క‌డ వైసీపీ లీడ‌ర్లు త‌న‌కు వ్య‌తిరేకంగా కుర్చీలాట మొద‌లు పెట్టారంటూ ధూం ధాం అన్నారు. ఒక ఎమ్మెల్యే అయిన త‌న‌కంటూ వేదిక‌పై  కుర్చీ వేయ‌లేదంటూ ఆ స‌మావేశమంతా నిల‌బ‌డి నిర‌సన చేశారు. ఇప్పుడు చూస్తే.. క‌డ‌ప పేరెడ్ గ్రౌండ్ లో నిర్వ‌హించిన స్వాతంత్ర దినోత్స‌వ వేదిక‌పై త‌న‌కు కుర్చీ వేయ‌లేదంటూ తీవ్రంగా మండి ప‌డ్డారు. తాను ఎమ్మెల్యే అయినా   ప్రోటోకాల్ ప్ర‌కారం కుర్చీ వేయ‌లేదంటూ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం  చేశారు. అధికారుల‌కు ముందు వరుసలో కూర్చీ వేసి.. ఎమ్మెల్యే అయినా తనను పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మేడం పంద్రాగస్టు వంటి కార్యక్రమాలకు అలాంటి ప్రోటోకాల్  ఉండదు, ప్లీజ్ అర్ధం చేసుకోండి అంటూ అధికారులు ఎంత న‌చ్చ చెప్పినా,  క‌డ‌ప రెడ్డెమ్మ మాత్రం కుర్చీ మే స‌వాల్ అంటూ వారిని అట్టుడికించారు. అదేంటో గ‌త కొంత కాలంగా ఈ రెడ్డెమ్మ‌కు కుర్చీతో పెద్ద కీచులాటే వ‌చ్చిన‌ట్టుంది. ఆమె మ‌న‌సులో ఈ విష‌యం ఒక ఆందోళ‌న‌తో కూడిన- కుట్ర‌లో భాగ‌మైన- ఒక వ్య‌వ‌హారంగా గూడుక‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌డ‌ప మున్సిప‌ల్ స‌మావేశంలో మొద‌లైన ఈ కుర్చీ కాన్ స్పిర‌సీ థియ‌రీ.. ఎక్క‌డికెళ్లినా ఆమెను వెంటాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.  నేను ఒక ఎమ్మెల్యే కాబ‌ట్టి నాకంటూ ఒక కుర్చీ వేసి.. దానికంటూ ఒక‌ ట్యాగ్ త‌గిలించి.. ఆ నీట్ వైట్ చైర్ ని అన్ని కుర్చీల మ‌ధ్య‌లో వేసి.. అలా ఖాళీగా పెట్టి ఉంచితేనే ఆమె  సంతృప్తి పడతారనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకండీ మేడంగారూ  కుర్చీ అంటూ  మీరంత‌ ఫైర్ అయిపోతున్నార‌ని.. ఆమె అంత‌రంగిక వ‌ర్గాల వారు వారిస్తున్న‌ట్టుగా అడిగితే.. మ‌నం ఇంత చేసి గెలిచింది ఈ కుర్చీ కోస‌మేగా.. నీకేం తెలీదు ఊర్కో అంటున్నార‌ట క‌డ‌ప ఎమ్మెల్యే రెడ్డెప్ప‌గారి మాధ‌వీ  రెడ్డి.  ఇంట్లో కూడా ఆమె కూర్చునే కుర్చీలో భ‌ర్త, పిల్ల‌లు, ఇత‌ర బంధుమిత్రులు ఎవ్వ‌రూ  కూర్చోర‌ట‌. కార‌ణం అది ఎమ్మెల్యేగారి కుర్చీ. మ‌నం ఆ సీట్లో కూర్చోవ‌ద్ద‌ని వారికి వారు ఫిక్స‌య్యార‌ట‌. అది కూడా మున్సిప‌ల్ స‌మావేశం త‌ర్వాత ఈ జ్ఞానోద‌యం అయ్యి.. అలా ఒక ఆచారం పాటిస్తున్నార‌ట‌. ఎందుకంటే బ‌య‌ట ఆమెకంటూ క‌నీస గౌర‌వంతో కూడిన కుర్చీ వేయ‌డం లేదు. దీంతో ఆమెకు ముక్కు మీద కోపం వ‌చ్చేస్తోంది. ఇంట్లో కూడా అలాంటి సీన్ చూడ్డం ఇష్టం లేక ఇంట్లో వారు అలాంటి అల‌వాటు ఒక‌టి చేసుకున్నార‌ట‌.  అక్క‌డ మొద‌లైన ఈ కుర్చీలాట ఆమె మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయి పోయింద‌ని.. ఇంటా బ‌య‌టా ఆమె కోసం ప్ర‌త్యేకంగా వేసిన కుర్చీ క‌నిపించ‌కుంటే ఒంటికాలిపై లేస్తార‌న్న టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది.  అయితే కొన్ని కొన్ని స‌మ‌యా స‌మ‌యాల్లో మాత్ర‌మే కుర్చీ ప్రోటోకాల్ ఉంటుంది. అంతేగానీ అన్ని చోట్లా కుర్చీ- కుర్చీ- కుర్చీ అంటూ కుర్చీనామ‌జ‌పం చేయ‌రాద‌ని.. కాస్త ఎవ‌రైనా చెప్పండ‌య్యా ఆమెకు అంటున్నార‌ట‌ అధికారులు. మ‌రి చూడాలి.. మేడంగారి మ్యూజిక‌ల్ చైర్ గేమ్ ఇంకెంత కాలం న‌డుస్తుందో !
 క‌డ‌ప రెడ్డెమ్మ కుర్చీలాట‌ Publish Date: Aug 16, 2025 1:28PM

మోడీ దీవాళీ ధమాకా ఆఫ‌ర్.. జీఎస్టీలో సవరణలు

దేశ రాజధాని ఢిల్లీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం (ఆగస్టు 15) ఘనంగా జరిగాయి. ఎర్రకోట వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోడీ  జాతీయ జెండాను ఎగురవేశారు. ఉదయం ఏడున్నర గంటల సమయంలో.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దీవాళి గిఫ్ట్ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే జీఎస్టీ సంస్కరణలు దేశానికి దీపావళి కానుకగా కోబోతున్నాయని ప్రధాని మోడీ పంద్రాగస్టు వేడుకల సాక్షిగా ప్రకటించారు. ఈ దీపావళికి దేశ ప్రజలకుగానూ.. డబుల్‌ దీపావళి కానుక ఇస్తున్నట్టు ప్రకటించారు మోడీ. దేశ పౌరులకు పెద్ద బహుమతి అందుతుందనీ,  తాము నెక్స్ట్‌ జెనరేషన్ జీఎస్టీ సంస్కరణలను తీసుకువస్తున్నామనీ చెప్పారు. ఈ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పన్ను భారం తగ్గుతుందన్నారు. ఇది దీపావళికి ముందే   అందించే బహుమతిగాఅభివర్ణించిన ఆయన.. ఈ సంస్కరణలు  దేశ ప్రజల దిల్ ఖుష్ అయ్యే శుభవార్త అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అనేక సంస్కరణలు చేపట్టామని అందులో జీఎస్టీ ప్రధానమైనదనీ గుర్తు చేసిన మోడీ,  గతంతో పోలిస్తే జీఎస్టీ విధానం ద్వారా పన్నుల భారం తగ్గించామని.. ట్యాక్సేషన్ ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు.  సరిగ్గా 2017 జులై 1న, జీఎస్టీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పడు ఆ నిబంధనలు అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్బంగా వీటిని సమీక్షించే సమయం ఆసన్నమైందన్నారు.  ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి.. రాష్ట్రాలతో చర్చలు జరుపుతామన్నారు. ఇప్పటికే కొత్త జీఎస్టీ సంస్కరణలను సిద్ధం చేశామని వివరించారు. సామాన్యులపై పడే వస్తు సేవల భారం.. కొత్త సంస్కరణ ద్వారా గణనీయంగా తగ్గుతుందన్న తీపి కబురు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద లాభం కలుగుతుందన్న హ్యాపీ న్యూస్ అందించారు.  నిత్యవసర వస్తువులు చౌకగా లభిస్తాయనీ.. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోడీ అన్నారు.  దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే యూపీఐ  సేవలను ఎర్రకోట వేదికగా ప్రశంసించారు  ప్రధాని. ఈ రోజు ప్రపంచం యూపీఐ అనే ఒక అద్భుతాన్ని చూస్తోందనీ.. రియల్‌ టైమ్ లావాదేవీలలో 50 శాతం  భారత్‌లోనే యూపీఐ ద్వారా జరుగుతున్నాయన్నారు.  సోషల్ మీడియా, క్రియేటివ్ రంగాల్లో అన్నీ మనవే ఎందుకు కాకూడదని.. యువతకు సవాల్ విసిరారు.    
మోడీ దీవాళీ ధమాకా ఆఫ‌ర్.. జీఎస్టీలో సవరణలు Publish Date: Aug 16, 2025 1:14PM

నాలుగు రోజుల పాటు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం రద్దు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగాపెరిగింది. వరుస సెలవు రావడం, అలాగే శ్రావణమాసంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం శుభప్రధమన్న భక్తుల విశ్వాసం కలిసి శ్రీశైల క్షేతం భక్త జనసంద్రంగా మారింది. దీంతో  మల్లన్న స్పర్శ దర్శనాలను నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం (ఆగస్టు15) ఆగస్టు18 వరకు మల్లన్న స్పర్శ దర్శనాలు, గర్భాలయ, అభిషేక, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక వైపు శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచి ఉండడం, మరోవైపు వరుస సెలవు దినాలు కావడం, ఈ రెంటికీ తోడు  శ్రావణ మాసం కావడంతో మల్లన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది.   వచ్చిన భక్తులందరికీ మల్లన్న అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు శీఘ్ర, అతి శీఘ్ర టికెట్లైన 150, 300, 500 రూపాయల టికెట్లను తీసుకొని ఆయా క్యూ లైన్ ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, నిలిపివేసిన సేవలు వినా మిగతా ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయని అధికారలు తెలిపారు.  స్వామివారి ఆలయంలో హోమాలు,  స్వామి వారి కళ్యాణం యథావిథిగా జరుగుతాయన్నారు.  
నాలుగు రోజుల పాటు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం రద్దు Publish Date: Aug 16, 2025 12:56PM

సృష్టి కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ డిస్మిస్

తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో  డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.  నమ్రత తప కుమారుడి పెళ్లి ఉందని... అందుకే బెల్ మంజూరు చేయాలంటూ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  నమ్రత తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె కుమారుడి పెళ్లి పత్రికను సైతం కోర్టుకు సమర్పించారు. అయితే..   నమ్రత నుండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందనీ,  నమ్రత ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా నమ్రత నడిపించిన అక్రమ దందా కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని, ఈ  కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయని, పోలీసుల తరఫున న్యాయవాది తన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ దశలో ఆమెకు  బెయిల్ మంజూరు చేస్తే బయటికి వెళ్లి... సాక్షులను ప్రభావితం చేసే, బెదిరించే అవకాశాలు ఉన్నాయని, అందుచేత నమ్రతకు బెయిల్ మంజూరు చేయ వద్దంటూ పోలీసుల తరఫున న్యాయ వాది కోర్టును కోరారు. వాద ప్రతి వాదనలు విన్న అనంతరం సికింద్రాబాద్ కోర్టు నమ్రత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.
సృష్టి కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ డిస్మిస్ Publish Date: Aug 16, 2025 12:32PM

ఈ 5 సందర్బాలలో మొహమాటం, సిగ్గుతో ఉంటే చాలా నష్టపోతారట..!

  ఆచార్య చాణక్యుడు ప్రతి మనిషికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిని చాణక్య నీతి అని పిలుస్తారు.  చాణక్య నీతిలో చెప్పిన ఎన్నో విషయాలు  జీవితంలోని అనేక అంశాలను ఆచరణాత్మకంగా, సరళంగా ఉంచుతాయి. మతం, న్యాయం, సంస్కృతి, పాలన, ఆర్థిక శాస్త్రం, విద్య.. మానవ సంబంధాలు.. ఇలా ఆయన చెప్పని విషయమంటూ ఏదీ లేదు.  ఆయన బ్రతికిన కాలంలో చెప్పిన ఈ విషయాలు నేటికీ అంతే ప్రాముఖ్యంగా ఉన్నాయి. తాను చెప్పిన సూత్రాలను పాటించడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించి విజయపథంలో ముందుకు సాగవచ్చని చాణక్యుడు విశ్వసించాడు. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గుపడకూడని ఐదు సందర్భాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలేవో తెలుసుకుంటే.. జీవితంలో ఎంతో గొప్ప మార్పు చూడవచ్చు.  ఇంతకూ చాణక్యుడు చెప్పిన ఆ ఐదు సందర్భాలేవో తెలుసుకుంటే.. ధనం, ధాన్యం లావాదేవీలు, జ్ఞానం సంపాదించడం, తినడం, పరస్పర వ్యవహారాల్లో సిగ్గుపడని వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ఈ ఐదు విషయాల దగ్గర మొహమాటం పడటం,  సిగ్గు పడటం మానేయాలట. దాని గురించి వివరణ కూడా ఇచ్చారు.. మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడని 5 విషయాలు ధనం, ఆహార లావాదేవీలు.. డబ్బు, ధాన్యం విషయంలో సంకోచించకూడదట.  లావాదేవీల్లో సంకోచం ప్రదర్శిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడగడం..  ఎవరికైనా ఇచ్చిన డబ్బును అడగడానికి సిగ్గుపడటం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని  చాణక్యుడు చెబుతాడు.  ఇలా మొహమాటానికి, సిగ్గుకు పోతే  దగ్గర డబ్బు కొరత ఏర్పడి చివరికి ఏమీ లేని వ్యక్తిగా మారతాడట. జ్ఞానం.. చాణక్యుడి ప్రకారం విద్యను పొందేటప్పుడు ప్రశ్నలు అడగడానికి సంకోచించడం జ్ఞానం సంపాదించడంలో ఆటంకం కలిగిస్తుందట.  నేర్చుకోవడం అనే ప్రక్రియను  అసంపూర్ణంగా చేస్తుందట.  టీచర్ ని నిర్భయంగా ప్రశ్నలు అడగాలి, సందేహ నివృత్తి చేసుకోవాలి అంటున్నారు. అలా చేస్తేనే అభ్యసనం సంపూర్ణంగా ఉంటుంది. జ్ఞానార్జన కూడా సజావుగా జరుగుతుంది.   ఆహారం తినడం.. ఆచార్య చాణక్యుడి ప్రకారం తినడానికి సంకోచించిస్తే కడుపు నింపుకోలేరు. ఎప్పటికీ ఆకలితో ఉన్నట్లేనట. అవసరమైనప్పుడు అంటే ఆకలి వేసినప్పుడు ,  ఎక్కడైనా మంచి భోజనం చేసే అవకాశం వచ్చినప్పుడు మొహమాటం లేకుండా   తినాలట. ఇది మనిషిని సంతోషంగా ఉంచుతుందట. సంభాషణ,  ప్రవర్తన..  చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పరస్పర కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం,  సంబంధాలలో సంకోచం ఉండటం వల్ల  సంబంధాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. స్పష్టంగా, మర్యాదగా,  ఓపెన్ గా మాట్లాడటం,  ఓపెన్ గా అభిప్రాయాలు చెప్పడం,  ఇతరులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం   వల్ల  సంబంధాలు బలంగా ఉంటాయట.                           *రూపశ్రీ.
ఈ 5 సందర్బాలలో మొహమాటం, సిగ్గుతో ఉంటే చాలా నష్టపోతారట..! Publish Date: Aug 16, 2025 12:29PM

శ్రీవాణి టికెట్ల విక్రయంలో గందరగోళం

సరైన ప్రణాళిక, కార్యాచరణ, ఏర్పాట్లూ  లేకుండా శ్రీవాణి టికెట్ల విక్రయానికి తిరమల తిరుపతి దేవస్థానం ఉపక్రమించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి టీటీడీ శనివారం (ఆగస్టు 16) ఉదయం పదిన్నర గంటలకు శ్రీవాణి టికెట్ల విక్రయాన్ని ఆరంభిస్తామంటూ ప్రకటించింది. ఇందు కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసింది. శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం (ఆగస్టు 15)రాత్రి నుంచే క్యూలో నిలుచోవడంతో టీటీడీ అధికారలు, అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయాలను ఆరంభించేశారు. ఈ సమయంలో భక్తుల మధ్య స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. దీంతో టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసనకు దిగారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులకు సర్ది చెప్పడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.  
శ్రీవాణి టికెట్ల విక్రయంలో గందరగోళం Publish Date: Aug 16, 2025 12:14PM

అరటిపండే కదా అని లైట్ తీసుకుంటారేమో..  దీని లాభాలు తెలిస్తే షాకవుతారు..!

  ఎవరి ఇంటికైనా వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు.  అందుకే చాలామంది పండ్లు తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లే పండ్లలో అరటికే ప్రథమ స్థానం ఉంటుంది.  కేవలం ఇలా తీసుకెళ్లడమే కాదు.. ఏ పూజ అయినా, శుభకార్యం అయినా అరటిపండ్లకే ఓటేస్తారు.  రోజుకొక అరటిపండు తినాలని చాలామంది ట్రై చేస్తారు. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు.  అరటిపండ్లు ధర కూడా చాలా తక్కువ. అయితే అరటిపండ్లు చవగ్గా లభిస్తాయని,  అందరికి అందుబాటులో ఉంటాయని చాలా  చులకనగా చూస్తారేమో.. కానీ అరటిపండ్లు తింటే కలిగే లాభాలు తెలిస్తే  షాకవుతారు. అరటి పండు చాలా చవకగా లభించే పండు. కానీ ఒక అరటిపండు తిన్నారంటే దాదాపు గంటకు పైగా ఆకలిని భరించవచ్చు. పైగా ఇందులో పోషకాలు శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. అందుకే వ్యాయామం చేసేవారు,  జిమ్ చేసేవారు అరటిపండును వ్యాయామానికి ముందు లేదా తరువాత తప్పకుండా తీసుకుంటారు. అరటిపండు లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు రోగులకు అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అరటిపండును చిన్న పెద్ద ఎవ్వరైనా తినగలుగుతారు.  వృద్దులకు, దంతాలు లేని వారికి కూడా అరటి ఎంచుకోదగిన పండు.  అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నీరసంగా అనిపించినప్పుడు ఒక్క అరటిపండు తిన్నారంటే శరీరానికి తక్షణ  శక్తి లభిస్తుంది.  అరటిపండులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటాయి.  ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అలసటగా అనిపించినప్పుడు అరటిపండు తినడం ప్రయోజనకరంగా భావించడానికి ఇదే కారణం. అంతేకాదు..  అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అరటిపండు తీసుకోమని చెబుతుంటారు.  అది కూడా శరీరానికి శక్తి లభించాలనే.. అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది . నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు అరటిపండు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందట. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
అరటిపండే కదా అని లైట్ తీసుకుంటారేమో..  దీని లాభాలు తెలిస్తే షాకవుతారు..! Publish Date: Aug 16, 2025 12:09PM

రాజుకుంటున్న బనకచర్ల.. రేవంత్ వర్సెస్ చంద్రబాబు.. మోడీ మౌనం

ఏపీ ప్రభుత్వం నిర్మించ సంకల్పించిన  బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం..  వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆ జలాలను  మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే దిగువ రాష్ట్రమైన ఏపీ నిర్మిస్తామంటున్న ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్లతో ఎగువ రాష్ట్రాలకు నష్టమేంటని నిలదీశారు. అలాగే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో బనకచర్ల అంశం ఇప్పుడు మరోసారి హీటెక్కి హాట్ టాపిక్ గా మారింది.  గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దానికి నిధుల కోసం  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో  సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. అయితే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. బనకచర్ల  ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పంద్రాగస్టు వేడుకల్లో కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా దక్కించుకుంటామని నిక్కచ్చిగా చెప్పారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు. అయితే సీఎం చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనీ,  సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామనీ, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటి? అని పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నలు సంధించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. కాగా రాయలసీమను నీటితో సశ్యశామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాజుకుంది. చంద్రబాబు మాత్రం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.  మరి చూడాలి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందో?
రాజుకుంటున్న బనకచర్ల.. రేవంత్ వర్సెస్ చంద్రబాబు.. మోడీ మౌనం Publish Date: Aug 16, 2025 11:13AM