యూపీఏ కు ప్రమాదం లేదు
posted on Mar 19, 2013 4:57PM

యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలగడం వల్ల యుపిఏ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. యుపిఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, అధికారంలో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి డిమాండ్లను పరిశీలిస్తున్నామని, మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నామని చిదంబరం పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వానికి తాము మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని యూపీఏ భాగస్వామ్య పక్షం డీఎంకే ప్రకటించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయే ప్రమాదమేమీ లేదన్నారు. యూపీఏకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని ఆయన తెలిపారు. శ్రీలంక తమిళల అంశంపై పార్లమెంట్లో తీర్మానానికి సంబంధించి డీఎంకేతో చర్చిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు. కరుణానిధి తన నిర్ణయంపై పునరాలోచించే సూచనలు ఉన్నాయని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.