భగవంతుడు ఆదేశించాడు...మనం చేస్తున్నాం...

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాపర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భగవంతుడు తనను ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాసిపెట్టి వుంది కాబట్టే ఇంత త్వరగా పనులు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయని, అనుకున్న సమయానికన్నా ముందుగానే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి చూపిస్తానని అన్నారు. ఐయాం వెరీ హ్యాపీ. భగవంతుడు ఆదేశించాడు. డెస్టినీ నిర్ణయించింది. ఆ పని మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం" అన్నారు. మొత్తం 4 వేల మంది నిత్యమూ శ్రమిస్తున్నారని, వారి కష్టంతో నవ్యాంధ్ర వాసుల కల నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. రోజువారీ, నెలవారీ, సీజన్ వారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇంకా వైఎస్ జగన్ కార్యాలయంలోకి వర్షపు నీరు రావడంపై మీడియా ప్రశ్నించగా.. ఇలాంటి పవిత్ర స్థలంలో అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu