సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు...
posted on Jun 8, 2017 11:17AM

గత కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో అట్టుడిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూకాశ్మీర్ లోని నౌగమ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖను దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబాటుకి ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఈ ఎన్‌కౌంటర్ లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ఇదిలా ఉండగా యూరి సెక్టార్ వద్ద కూడా ఈరోజు భారీ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఏడుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా సైన్యం వారిని అడ్డుకొంది. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.