చంద్రబాబుకు భద్రత పెంచండి.. కేంద్రం ఆదేశం..


మావోయిస్టుల నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటినుండో అపాయం పొంచి ఉందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ.. రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని ఈ మేరకు సూచించింది. అదనంగా మరో ఎన్ఎస్ జీ బృందాన్ని చంద్రబాబుకు కేటాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu