లండన్ పర్యటనలో బిజీ బిజీగా చంద్రబాబు.. ఎక్స్ క్ల్యూజివ్ ఫొటోస్
posted on Mar 12, 2016 6:58PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడి టాప్ 20 కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్టు తెలస్తోంది. ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు ఏపీ రాష్ట్ర పరిస్థితులు.. నూతన రాజధాని అయిన అమరావతి గురించి చర్చిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్‌సిటీ నిర్మాణంపై అక్కడ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకా నిర్మాణాలు, సౌకర్యాలు గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు అమరావతికి నిధుల సమీకరణలో సాయం అందించేందుకు లండన్ స్టాక్‌ఎక్సేంజ్ అంగీకరించింది. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దీంతో మొత్తానికి వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పర్యాటక సంస్థ లండన్ ఐని చంద్రబాబు బృందం సందర్శించింది. థేమ్స్ నది అందానికి ముగ్దులైన చంద్రబాబు నవ్వుతూ అక్కడ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. థేమ్స్ నదిలో బోటు షికారు చేశారు.
.jpg)