నా భర్త వేధిస్తున్నాడు : సింగర్ మథుప్రియ

 

గత అక్టోబర్లో పెద్దల్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది సింగర్ మధుప్రియ. శ్రీకాంత్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ తో ప్రేమలో పడి, ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లను ఎదిరించి, మథుప్రియ తన సన్నిహితుల సమక్షంలో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హుమయూన్ నగర్ పి ఎస్ లో తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది మథుప్రియ. వరకట్నం కోసం వేధించడమే కాక, అనుమానిస్తున్నాడని, ఫోన్ కూడా తీసేసుకుని ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదని ఫిర్యాదులో పేర్కొంది. కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధిస్తున్నారని, పెళ్లైన నాలుగు నెలల్లో తనకు నరకం చూపించాడని, అతని నుంచి తనకు రక్షణ కల్పించాలని కంప్లైంట్ లో పేర్కొంది. భర్త వేధింపులను తట్టుకోలేక మధుప్రియ ఏడుస్తూ పుట్టింటికి చేరుకుందని సమాచారం. తాజాగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హుమయూన్ నగర్ పి ఎస్ లో ఫిర్యాదును నమోదు చేసింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి విచారిస్తున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu