పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎలాంటి హోదా ఇస్తారు?
posted on Oct 12, 2015 12:35PM

ఏపీ రాజధాని అమరవాతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు ఎంతోమంది అతిధిలను ఆహ్వానించనున్నారు. దసరా రోజు జరగబోయే ఈ మహత్కర కార్యక్రమానికి ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తూ చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరూ ఒక విషయంపై చర్చించుకుంటున్నారు. అదేంటంటే.. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏ హోదాలో పిలుస్తారు అని. ఇప్పటి వరకూ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ వస్తారు.. కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తా.. జగన్ ను పిలుస్తా.. సోనియాను ఆహ్వానిస్తా అన్న మాటలే వినిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం.. గౌరవం దక్కుతుందా? కేవలం జనసేన పార్టీ అధినేతగానే ఆహ్వానిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ కు ఏరీతిలో ఆహ్వానం అందుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.