ఐఏఎస్ కావాల్సిన యువతి... మందు బాబుల రాష్ డ్రైవింగ్
posted on Jan 19, 2017 3:06PM
.jpg)
మందు తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. వారి డ్రైవింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం ఇప్పటివరకూ చాలా చూశాం. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఐఏఎస్ కావాల్సిన యువతి మృత్యు వడిలోకి చేరింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద గేటి గౌతమి, దంగేటి పావని ఇద్దరు అక్కాచెల్లెళ్లు యాక్టివా స్కూటర్‌పై వెళుతున్నారు. ఇదే రోడ్డులో వెళుతున్న సఫారీ కారు యాక్టివాను ఢీకొట్టడంతో అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్జారు. వారిని స్థానికులు నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడటంతో మరణించింది. పావని చికిత్స పొందుతోంది. కాగా గౌతమి ఎంబీఏ పూర్తిచేసి, ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా...టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యం సేవించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారుకు సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకి అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జునుజ్జు అయ్యింది. మద్యం మత్తులో మోటారు సైకిల్‌ను ఢీకొట్టారని అంటున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.