ప్రపంచం ఏమనుకుంటుందో మాకు అనవసరం.. క్రిస్ గేల్
posted on Jun 9, 2016 12:27PM

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తాను ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ ‘సిక్స్ మెషీన్’ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రపంచం మొత్తం మా గురించి ఏమనుకుంటుందో మాకు అనవసరం’ అని అన్న గేల్.. తనని తాను ప్రిసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లు బాల్‌లో రొనాల్డో , ఇబ్రమోవిచ్‌తో పోల్చుకున్నాడు. ఈ ఇరువురి ఆటగాళ్లతో పాటు తనని తాను ఛాంపియన్ వర్గానికి చెందిన వాడిగా అభివర్ణించుకున్నాడు. తమ శైలి, ఆటతీరు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో తమకు అనవసరమని.. రికార్డుల కోసం పరితపించడం తమకు అలవాటు లేదని ఆయన తెలిపాడు. తమ మీద తమకు ఉన్న నమ్మకంతోనే మైదానంలోకి దిగుతామని ఆయన చెప్పాడు.