చంద్రబాబు క్లాస్ పీకలేదు.. అంతా ఒట్టిదే...!
posted on May 2, 2017 3:56PM

సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించినందుకు గాను చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకు క్లాస్ పీకారు అన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన శివప్రసాద్.. ఆవార్తలను ఖండించారు. చంద్రబాబు నాకు క్లాస్ తీసుకున్నారు అన్న వార్తల్లో వాస్తవం లేదని.. చంద్రబాబు తనకు క్లాసు తీసుకున్నారనడం సరికాదన్నారు. చంద్రబాబును నిన్న కలిశానని..స్నేహపూరిత వాతావరణంలో తామిద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. ఆత్మీయులు, పెద్దల సూచనల మేరకే చంద్రబాబును కలిశానని, తాను ఆశించిన పనులన్నీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారని, తనకు ఉన్న అనుమానాలు తీర్చుకున్నానని చెప్పారు. కథ సుఖాంతమైందని, తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని, స్నేహం గొప్పదని మరోమారు రుజువైందని శివప్రసాద్ అన్నారు.