నా ప్రాజెక్టును ఏవరూ ఆపలేరు.. చంద్రబాబు
posted on May 14, 2015 12:44PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అవుకు రిజర్వాయర్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లుడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే రాయలసీమకు నీటి కొరత ఉండదని, కానీ ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామంటే కొంతమంది అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నా ప్రాజెక్టును ఆపలేరని స్పష్టం చేశారు. అవసరమైతే జల విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చి రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తామని అన్నారు. రాయలసీమకు గోదావరి నీరు ఇస్తున్నామని గోదావరి వాసులను రెచ్చగొడుతున్నారని, నీచ రాజకీయాతో గోదావరి ప్రాజెక్టును అడ్డుకున్నారని అన్నారు. కానీ.. పోలవరం ప్రాజెక్టుకు అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అనవసరంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని ఇకనుండి అన్ని పనులు స్వయంగా పర్యవేక్షిస్తామని తెలిపారు.