తెలంగాణలో మరో సమ్మె

 

తెలంగాణలో అలా ఆర్టీసీ సమ్మె ముగిసిందో లేదో మరో సమ్మెకు తెర లేచింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ 108 ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగారు. తొలగించిన ఉద్యోగులను విధల్లోకి తీసుకోవాలని, వేతన సవరణలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగుల మధ్య చర్చలు విఫలమవ్వడంతో.. 108 నిర్వహణ నుండి జివికె ను తప్పించాలని, ప్రభుత్వ హయాంలోనే 108 సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కమిషనర్ అజయ్ సమక్షంలో ఇటీవల జరిగిన చర్చలు ఈ నెల 13వ తేదీ బుధవారానికి వాయిదా పడ్డాయి. బుధవారంనాడు మళ్లీ చర్చలు విఫలం కావడంతో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు చెప్పారు. సమ్మె వల్ల దాదాపు 300 వాహనాలు నిలిచిపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu