చంద్రబాబు వాహనం బోల్తా...తీవ్ర గాయాలు

 

నిన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం పర్యటనకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో మరణించిన టీడీపీ శ్రేణుల కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.  ఈ నేపధ్యంలో ఆయన ఎస్కార్ట్ కోసం విజయవాడ నుండి పోలీసులు అనంతకి వెళ్లారు, ఆ తర్వాత వారు తిరుగు ప్రయాణం అవుతుండగా ఆ వాహనం ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెనుకొండ సమీపంలో చంద్రబాబుకు ఎస్కార్ట్ వెళ్లిన పోలీసులు తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ బండి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu