కేంద్రానికి చంద్రబాబు లేఖ...

 

రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం, కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల అమ‌లుపై చంద్రబాబు మంత్రులు, అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్బంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. 2017 జూన్‌ 1తో ముగిసే స్థానికతను మరో రెండేళ్లు పొడిగించాలని.. ముఖ్యమంత్రి కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయనున్నట్టు నిర్ణయించుకున్నారని తెలిపారు. అంతేకాదు ఉన్న‌త విద్యామండ‌లి విష‌యంలో సుప్రీం తీర్పుకు వ్య‌తిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణ‌యం తీసుకుంద‌ని...కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం ర‌ద్దు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరిందని అన్నారు.