ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. దిగ్గజ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ డెల్ ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డల్లాస్‌లో డెల్ కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ సత్యతో భేటీ అయ్యారు. అనంతరం ఐటీ సేవల రంగంలో ప్రతిష్టాత్మక సంస్థలకు పేర్కొనే 28 సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చి తమ అధికారులతో మాట్లాడాలని వారికి సూచించారు. ఈ నేపథ్యంలో అమరావతి, విశాఖ నగరాల్లో కార్యకలాపాలకు అవి అంగీకారం తెలిపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu