సింగపూర్‌లో చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళిన విషయం విదితమే. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆహ్వానించడంతోపాటు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ నగరాన్ని అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు బృందం సింగపూర్‌ పర్యటనకు వెళ్ళింది. సింగపూర్‌కి చేరుకున్న చంద్రబాబు బృందానికి సింగపూర్ ఎయిర్‌పోర్టులో అక్కడి తెలుగువారు సాదర స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మొదటి రోజు సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఈశ్వరన్‌కి వివరించారు. ఈశ్వరన్‌తో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని ఆయనతో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu