నిర్మలాసీతారామన్ కు చంద్రబాబు థ్యాంక్స్.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కు థ్యాంక్స్  చెప్పారు. తన దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలలో భాగంగా ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిర్మలా సీతారామన్ కు థ్యాంక్స్ చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11 వేల 440 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ణతలు తెలిపారు.

ఈ భేటీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఉన్నారు. మరి కొద్ది రోజులలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వికసిత ఆంధ్రప్రదేశ్ – 2047 కలని సాకారం చేసేలా, అమరావతి, పోలవరం సహా  రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు, అలాగే నూతన ప్రాజెక్టులకు బడ్జెట్ లో  సముచిత రీతిలో నిధులు కేటాయించాలని చంద్రబాబు ఈ సందర్భంగా విత్తమంత్రిని కోరారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu