గోదావరిలో పడిన భద్రాచలం బస్సు
posted on May 21, 2015 1:25PM

ప్రయాణికులతో వున్న బస్సు భద్రాచలం వద్ద వంతెన మీదనుంచి గోదావరిలో పడిపోయింది.ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డాడరు. సారపాక నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వంతెన ఎక్కే సమయంలో ఎడమవైపు వేగంగాదూసుకెళ్ళి తలకిందులుగా నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. అయితే నదిలో నీళ్ళలో కాకుండా నీళ్ళు లేని ప్రాంతంలోనే బస్సు పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది.30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. బస్సు పల్టీలు కొడుతూ కింద పడిపోవడంతో గాయపడినవారి సంఖ్య బాగా పెరిగింది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను నల్గొండ జిల్లా కోదాడ పట్టణానికి చెందిన బి.శ్రీవాణి (30)గా గుర్తించారు.