ఉగ్రవాది ఖలీద్ దొరికిపోయాడు

 

కరడుగట్టిన ఉగ్రవాది ఖలీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ ఐఎన్ఎ మంగళవారం నాడు అరెస్టు చేసింది. ఖలీద్ దగ్గర నుంచి పేలుడు పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ళలో ఇద్దరు మరణించారు. ఆ పేలుళ్ళ కేసులో ఖలీద్ నిందితుడు. మయన్మార్ దేశానికి చెందిన ఖలీద్ హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న విషయాన్ని పసిగట్టిన ఐఎన్ఎ అధికారులు పక్కా ప్లాన్‌తో ఖలీద్‌ని అరెస్టు చేశారు. ఇదిలా వుండగా, బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను  బెంగాల్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ జెఎంబి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.