బోరుబావిలోనే చిన్నారి.. రోదనలు...

 

రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల బాలిక గిరిజ ప్రమాదవశాత్తు పడిపోయింది. 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన గిరిజను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం గిరిజ తాత తన పొలంలో వేసిన బోరుబావిలో నీరు పడకపోవడంతో కేసింగ్‌ తీసి గోతిని పూడ్చివేయకుండా అలాగే వదిలేశాడు. ఆదివారం నాడు పొలంలో పెద్దలు పని చేసుకుంటూ వుండగా, గిరిజ ఆడుకుంటూ వెళ్ళి బోరు గోతిలో పడిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాధికారులు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. బాలిక బతికి వుండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే బాలికను వెలికితీసే పనులు మాత్రం జరుగుతూనే వున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu