తెలంగాణలో డిజిటల్ విప్లవం రానుంది... మంత్రి కేటీఆర్

 

తెలంగాణలో డిజిటల్ విప్లవం రాబోతోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణలో రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్నీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చనున్నట్టు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన పెగా డెవలపర్స్ ద్వితీయ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ శుభవార్త చెప్పారు. త్వరలోనే టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో ఐదువేల కంపెనీలు భాగస్వాములు అవుతాయని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu