ప్రజాకాంక్షలను విస్మరించడంలో కాషాయ దళం.. గులాబి దండు.. దొందూ దొందే..

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్బంగా రెండు రోజుల పాటు ఇటు బీజేపీ, అటు తెరాస హైదరాబాద్ వేదికగా రాజకీయ సర్కర్ చేశాయి. ప్రజలతో సంబంధం లేని విన్యాసాలెన్నో చేశాయి. ప్లెక్సీల యుద్ధం నుంచీ కేంద్రం సహాయం వరకూ ఇరు పార్టీలూ పరస్పర విమర్శలలో పోటీ పడ్డాయి.  కాషాయ దళం మొత్తం రావడం చుస్తే  గులాబి కోటని ఆక్రమించుకోవడానికి రాజు తన బలం తో సైన్యం తో వచ్చి తన బలం ఏమిటో చూపించి  నట్టు వుంది.

ఆదివారం  హైదరాబాద్ లో  జరిగిన భారతియ జనతా పార్టీ విజయ సంకల్పసభ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి మాటలమయజాలం తో అందర్నీమాయలో పడేసారు .మిణుగురు పురుగులు రాత్రి ఎగురుతూ  సూర్యుడిని కమ్మేసాం  అని ఆనంద పడతాయి, కానీ వాటికీ తెలియనిది ఏమిటంటే అవి సుర్యుని ముందు నిలబడలేవని అన్నటు సాగింది మోడీ ప్రసంగం, ఎవర్ని విమర్శించకుండా కేవలం 
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న,చేసిన,చేయబోయే  అభివృద్ధిపైనే మాట్లాడి తన మార్కు చతురత చూపించారు. తనపై ఎ న్ని విమర్శలు చేసినా ప్రధాని స్పందించకుండా తన దృష్టిలో కేసీఆర్ స్థాయి ఏమిలో చెప్పకనే చెప్పారు.   ఆదివారం  జరిగిన సభ మొత్తం లో కూడా ఎ క్కడా కేసీఆర్ గురించిగాని, గులాబి పార్టీ గురించి గాని   మాట్లాడకుండా,విమర్శలు చేయకుండా 
 తన ప్రసంగాన్ని ముగించారు.  సబ్ కా సాత్,సబ్ క వికాస్ నినాదం తో తెలంగాణా అభివృధి చేస్తాం అన్నారు. ఎనిమిదేళ్ల  పాలనలో అందరి సంక్షే మం కోసం కృషి చేస్తున్నాం,అభివృధి దేశం నలుమూలలా అందాలని చూస్తున్నాం.తెలంగాణాని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ అన్ని  విధాలా కృషి చేస్తోందన్నారు. డైనమిక్ తెలంగాణ అభివృద్ధికిక సదా కేంద్రం చేయూత ఉందని, ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో కేంద్రం సహాయం, సహకారం ఉందని స్పష్టం చేశారు.

 హైదరాబాద్ మహానగరం లో 1500 కోట్లతో 6  లేన్ల రహదార్లు  నాలుగు నిర్మిస్తున్నామని మోడీ చెప్పారు.  అలాగే ట్రాఫిక్ ఇబ్బందిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ నిర్మింనుందన్నారు.  .తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని ,అలా ఐతే నే వేగంగ అభివృధి జరుగుతుందని చెప్పారు. ఐతే  ఎంతసేపు ఏం చేస్తామో చెప్పారు. ఇంత వరకూ బానే ఉంది కానీ,   ప్రస్తుతం దేశం లో వున్న పరిస్థితులపై ఆయన మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదల నడ్డి విరిగేలా  ఇందనం దరలు,గ్యాస్ సిలండర్, నిత్యావసర వస్తువల ధరల  బాదుడుపై మోడీ పన్నెత్తి మాట్లాడలేదు. దీనిపై గులాబి శ్రేణులే కాకుండా సామాన్య జనం కూడా విమర్శిస్తున్నారు.  ఇదిలా ఉంచితే.. మోడీ ప్రసంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంప పెట్టుగా ఉందని, తనను తాను అతిగా ఊహించుకుని ఆకాసంలో విహరిస్తున్న కేసీఆర్ ను నేల మీదకు దింపి వాస్తవాన్ని ఎరుకపరిచిందని కాషాయదళం సంబర పడుతోంది. ఏకంగా ప్రధానికే ప్రసంగ అజెండా నిర్దేశించానంటూ తన భుజాలు తానే చరుచుకుని విర్రవీగిన సీఎం.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయాన్ని, సహకారాన్ని అంగీకరించక తప్పని పరిస్థితుల్లో పడ్డారని కాషాయ శ్రేణులు అంటున్నాయి.

మరో వైపు మోడీ ప్రసంగం పలాయన వారి సంధి మంత్రంగా ఉందని గులాబి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కే సీ ఆర్ ప్రశ్నలకి సమధానం చెప్పలేక పోవడం వల్లే.. కాదు కాదు కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేనందువల్లే ఆయన తన ప్రసంగంలో వాటి గురించి ప్రస్తావించలేదని  గులాబి శ్రేణులు అంటున్నాయి.  దేశం లో తెలంగాణా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా  ఉంది కనుకనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదిక చేసుకున్న కమల నాథుుల రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నాయి.

 దేశ  ప్రధాని మోడీ కాదు మోళీ అని తెరాస శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.  మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో  బీజేపీ ఆడంబరం, టీఆర్ఎస్ దూకుడు రెండూ కూడా  కూడా ప్రజాకాంక్షలను ప్రతిబింబించడంలో విఫలమయ్యాయి. మొత్తం వ్యవహారాన్నంతా ఆధిపత్య ప్రదర్శనా పోరుగా మార్చేశాయి. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ ఈ మొత్తం వివాదానికి దూరంగా మౌనంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతుండటం జనం బీజేపీ, తెరాసలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.