భాగ్యనగరంలో బిచ్చగాళ్ల వన్‌ డే ఇన్‌కామ్ ఎంతో తెలుసా..?

ఆ బిచ్చగాళ్లు అంటే ఏ సిగ్నల్ దగ్గరో లేదంటే గుడి దగ్గరో తినడానికి తిండిదొరక్క, వేసుకోవడానికి బట్టలులేని వాళ్లు అని అందరికీ ఓ ఫీలింగ్ మనసులో పడిపోయింది. అందుకే బిచ్చగాళ్లు కనిపిస్తే చాలు...చేయి ఆటోమేటిగ్గా జేబులోకి వెళ్లిపోతుంది. మనం మానవత్వంతో ఆలోచిస్తే..చాలా మంది మాత్రం బిక్షాటనను ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ బిచ్చగాళ్లకు అడ్డాగా మారిపోయింది. ఇటీవల జీహెచ్‌ఎంసీ చేసిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. ఆ సర్వే ప్రకారం నగరంలో 20 మంది బిచ్చగాళ్లు ఉన్నారట..వారి రోజువారి ఆదాయం కోటీ రూపాయలట..అంతేనా వీళ్లు ఆదాయం కోసం పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తారు..మహిళలు చంటి బిడ్డలను సానుభూతి కోసం వెంటపెట్టుకుంటారు. హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, అబిడ్స్, కోఠి బస్టాప్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్, దిల్‌సుఖ్‌నగర్ బిచ్చగాళ్లకు స్వర్గధామాలుగా వెలుగొందుతున్నాయి.