రోహిత్‌ శర్మ రికార్డ్‌

 

దీపావళి ఒక రోజు ముందుగానే క్రికెట్‌ అభిమానులకు పండుగ వచ్చింది.. సాధారణ స్కోర్‌ చేయటమే కష్టం అనుకున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ వీరోచిత ఇన్నింగ్స్‌ తో  భారత్‌ తిరుగులేని స్కోర్‌ను సాదించింది. అంతేకాదు ఈ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ తన కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ 209ని సాధించాడు. దీంతో 200 మార్క్‌ దాటిన మూడో భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రోహిత్‌ శర్మ.

 

గతంలో సచిన్‌, సెహ్వాగ్‌లు మాత్రమే సాదించిన ఈ రికార్డ్‌ను రోహిత్ అది కొద్ది సమయంలోనే అందుకున్నాడు. 158 బాల్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ, 16 సిక్స్‌ లు , 12 ఫోర్లతో 209 పరుగులు చేశాడు. రోహిత్‌ దూకుడుకు థావన్‌ 60, ధోని 62 పరుగులు తోడై భారత్‌ 383 పరుగుల భారీ స్కోర్‌ను ఆస్ట్రేలియా ముందుంచింది. రోహిత్‌ ఇన్నింగ్స్‌ చూసిన క్రికెట్‌ పండితులు సచిన్‌ రిటైర్‌మెంట్‌ తరువాత కూడా భారత క్రికెట్‌ కు ఎటువంటి ప్రమాదం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu