యూ.ఎస్ లో రికార్డులు బ్రేక్ చేసిన 'బాద్‌షా'
posted on Apr 8, 2013 10:49AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్‌షా' తో యూ.ఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ని చూపిస్తున్నాడు. 'బాద్‌షా' యూ.ఎస్ లో మొదటి మూడు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసి కొత్త రికార్డ్ ను సృష్టించాడు. 1 మిలియన్ డాలర్స్ ను మూడు రోజుల్లో క్రాస్ చేసిన మొదటి తెలుగు సినిమా బాద్‌షా నే. ఈ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న బాద్‌షా మొదటివారం రికార్డులు సృష్టించడం ఖాయం గా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈచిత్రాన్ని అమెరికాలో దాదాపు 120 స్క్కీన్లలో భారీ ఎత్తున విడుదల చేసారు. ఇది వరకు మిర్చి చిత్రం ఇక్కడ అత్యధిక థియేటర్లలో విడుదల కాగా... ‘బాద్ షా' చిత్రం దాన్ని బీట్ చేసింది.