ఈ ఉగాది పవన్ ఫ్యాన్స్ కి పండగే

 

 

pawan kalayan trivikram, pawan kalayan new movie, trivikram pawan kalayan

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది పండగ రోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఉగాది రోజు తెరపడనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 3 కోట్ల ఖర్చుతో వేసిన సెట్ లో జరుగుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu