అల్లు అర్జున్..'బాద్‌షా' మీద దృష్టి పెట్టమన్నాడు
posted on Apr 8, 2013 11:43AM

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ నిలుస్తుందని అన్నారు. 'బాద్ షా' షూటింగ్ టైం లో ‘ఇద్దరమ్మాయిలతో’ సెట్స్ కి వెళ్ళానని..అల్లు అర్జున్ తన షాట్ అయిపోయిన తరువాత నువ్వు వెళ్లి ‘బాద్ షా’ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టు, ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రొడక్షన్ విషయాలు నేను చూసుకుంటానని చెప్పారని అన్నారు. పని మీద అల్లుఅర్జున్ కి వున్న అంకిత భావానికి హాట్సాఫ్ చెప్పారు. ఇద్దరమ్మాయిలతో’లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయడానికి పాలన్ చేస్తున్నారు. మే 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.