సైనికులపై అజంఖాన్ సంచలన వ్యాఖ్యలు...మర్మాంగాలను కోసేయాలి...

 


సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసింది సైనికులపై. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని...రేప్ లకు పాల్పడే సైనికులపై ప్రతీకార చర్యలకు దిగాలని, వారి మర్మాంగాలను కోసివేయాలని అన్నారు. జమ్ముకశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దారుణాలు పెరిగిపోతున్నాయని అన్నారు.