వారి మాటల్లో అర్ధమయింది.. జేసీ
posted on Aug 8, 2015 4:33PM

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ చెపుతుంది. దీనిపై ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్ర ఆర్ధికంగా చాలా దెబ్బతిందని.. అయినా కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టామని, అభివృద్ధి కోసం అప్పులు కూడా చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఏపీ ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా రాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషాత్, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో మాట్లాడినప్పుడు వారి మాటల్లో ఏపీకి ప్రత్యేకహోదా రాదన్న విషయం అర్ధమయిందని.. అయితే వారికి రాష్ట్రంపై సానుభూతి ఉందని.. రాష్ట్రాభివృద్దికి కేంద్రం డబ్బులిస్తుందని ఆయన స్పష్టం చేశారు.