పొదుపు చేయండి... చంద్రబాబు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ కర్నూలు జిల్లాలో నీరు-చెట్టు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. కొటేకల్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమను కరువురహిత ప్రాంతంగా మారుస్తానని, సీమకు పూర్వ వైభవం తేవడానికి రాత్రింబవళ్లు పనిచేస్తానని అన్నారు. నీటిని నిల్వచేసుకోవడం వల్ల పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వర్షం ద్వారా వచ్చే నీటిని వూట చెరువులు, చెక్ డ్యాముల వల్ల సంరక్షించుకుంటే వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చని అన్నారు. అన్ని గ్రామాలలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రావడానికి నాలుగేళ్లు పడుతుందని, అది వచ్చేలోగా పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతున్నామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu