8 మంది వైసీపీ సభ్యుల సస్పెన్షన్
posted on Mar 19, 2015 11:31AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అభ్యంతరకరమైన భాషను వాడి, అనుచితంగా ప్రవర్తించినందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం నాడు మూడు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఈనెల 23 వరకూ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కొనసాగనుంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం ఇచ్చారు. సస్పెన్షన్ను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు:
1.గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి)
2. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి)
3. ముత్యాల నాయుడు (మాడుగుల)
4. కొడాలి నాని (గుడివాడ)
5. సీహెచ్. జగ్గిరెడ్డి (కొత్తపేట)
6. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)
7. శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు)
8. చాంద్ బాషా (కదిరి)