గ్యాస్ సిలిండర్ల లారీ బ్లాస్ట్
posted on Mar 19, 2015 11:37AM

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బెంగుళూరు నుంచి వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకొంది. బెంగుళూరు నుంచి వస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. సిలిండర్ల లారీ ప్రమాదానికి గురైంది, అందరూ దూరంగా వెళ్లాలని డ్రైవర్ హెచ్చరించడంతో గ్రామస్థులు అప్రమత్తమై గ్రామం నుండి దూరంగా వెళ్లిపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నా.. గ్యాస్ సిలిండర్లు పేలి ఇనుప ముక్కలు వచ్చి తగులుతుండటంతో మంటలు అదుపుచేయలేకపోయారు. ఈ సంఘటనతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సిలిండర్లు పేలాలు పేలినట్టు పేలుతూనే ఉన్నాయి. లారీలో మొత్తం 450 సిలీండర్లు ఉండగా 100 సిలీండర్లు పేలిపోయాయి.