ఏపీ లిక్క‌ర్ స్కామ్ ఛార్జ్ షీట్ .. దిమ్మ‌తిరిగే నిజాలు వెలుగులోకి

మ‌ద్య‌పాన  నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి  పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  సిట్ వేసిన 305 పేజీల‌ ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీల‌క పాత్ర పోషించినది  ఏ 1 రాజ్ కేసిరెడ్డి. అంతే కాదు ఈ డ‌బ్బుల‌తో ఆయ‌న గ‌చ్చిబౌలిలో ఒక ప్లాట్ ఆపై వివిధ ప్రాంతాల్లో 92 ఎక‌రాల మేర త‌న త‌ల్లి,  త‌న‌ సంస్థ ఎషాన్ ఇన్ ఫ్రా పేరిట ఈ భూములు కొన్న‌ట్టుగా  గుర్తించారు విచార‌ణాధికారులు. ఈ భూముల  విలువ   110 కోట్ల మేర ఉంటుందంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ బినామీ సొమ్మును ప‌రి ప‌రివిధాలుగా ఖ‌ర్చు చేయ‌డానికి  రాజ్ కేసిరెడ్డి, అత‌డి అనుచ‌ర గ‌ణం.. ప్ర‌య‌త్నంచిన‌ట్టు తెలుస్తోంది. జాంబియా, టాంజీనియా వంటి ఆఫ్రిక‌న్ దేశాల్లో మైనింగ్ చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలు కూడా వీరు ప‌రిశీలించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ దిశ‌గా వీరు ఆయా దేశాల‌కు ట్రిప్పులు వేసిన‌ట్టు కూడా గుర్తించారు విచార‌ణాధికారులు.  యూఏఈ, యూకేల్లోనూ  ర‌క‌ర‌కాల కంపెనీలు స్థాపించిన‌ట్టు గుర్తించారు. ఇందుకోసంగానూ రాజ్ కేసిరెడ్డి అండ్ కో ఏకంగా 28 సార్లు ఫారిన్ టూర్లు వేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇక ఎన్నిక‌ల్లో న‌గ‌దు పంప‌కాల కోసం ఎంత మొత్తం వాడార‌ని చూస్తే.. సుమారు 200 కోట్ల రూపాయ‌ల మేర‌.. ఈ మ‌ద్యం డ‌బ్బులోంచి వాడిన‌ట్టు సిట్ గుర్తించింది  ఇందుకోసం హైద‌రాబాద్, తాడేప‌ల్లిలో కొన్ని స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు చెబుతున్నారు విచారణాధికారులు. ఇదంతా ఏ 38 చెవిరెడ్డి అధ్వ‌ర్యంలో న‌డిచిన‌ట్టు స‌మాచారం. ఈయ‌న సూచ‌న‌ల మేర‌కు ఎక్క‌డెక్క‌డి నుంచి ఎంతెంత మొత్తం సొమ్ము ఎక్క‌డికి త‌ర‌లించాలో ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు. ఒక సారికి ఒక ట్రిప్పులో 8 నుంచి 12 కోట్ల రూపాయ‌ల మేర సొమ్ము త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు  తుడా వాహనాల‌ను సైతం వాడిన‌ట్టు గుర్తించారు.ఇలా ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి కూడా ఈ మ‌ద్యం సొమ్ము వాడిన‌ట్టు గుర్తించింది సిట్. ఇప్ప‌టి వ‌ర‌కూ అరెస్ట‌యిన వారిలో మిథున్ రెడ్డి రెండో రాజ‌కీయ ప్ర‌తినిథి కాగా.. మిగిలిన వారు ఎప్పుడ‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది. 

ఏ5 విజ‌య‌సాయిరెడ్డి ఎప్పుడు అరెస్టు అవుతార‌న్న‌ది స‌స్పెన్స్ గా మారింది. అయితే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చి.. అప్రూవ‌ర్ గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అదలా ఉంటే ఆల‌స్యం అవుతుందేమోగానీ ఆయన అరెస్టు మాత్రం ప‌క్కా అంటున్నారు. ఎందుకంటే విజ‌య‌సాయిరెడ్డి ఇన్వాల్వ్ మెంట్ ఈ మొత్తం ఇష్యూలో రెండు మూడు ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టాల్లో ఉన్న‌ట్టు సిట్ గుర్తించింది. మ‌రి చూడాలి  మంత్రి కొల్లు ర‌వీంద్ర చెప్పిన‌ట్టు త‌ర్వాతి బిగ్ వికెట్ ఎవ‌రిదో తేలాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu