కృష్ణాగోదావరి బేసిన్ కోసం 40 వేల కోట్లు

 

కృష్ణాగోదావరి బేసిన్ లో వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి దాదాపు రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయడానికి ఓఎన్జీసీ కంపెనీ సిద్ధమయ్యింది. రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాగోదావరి బేసిన్ లో ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్ పరిశ్రమలను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఓన్జీసీ సీఈఓ డికే షరఫ్ కలిసి ఇక్కడి పరిస్థితులను ఆయనతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్రో యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి, గ్యాస్ ఆధారిత విద్యుత్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఓన్జీసీ కోసం కొన్ని వేల కోట్లను వెచ్చించనున్నది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu