ఇండియా ఓపెనర్లు ఔట్ మిస్...

 

ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఇండియా - ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టు లక్ష్యాన్ని 329గా నిర్దేశించింది. శ్రమిస్తే అందుకునే లక్ష్యాన్ని ఛేదించడానికి భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రంగంలోకి దిగారు. రోహిత్ శర్మ గాల్లోకి లేపిన ఒక బంతి క్యాచ్ అయ్యేదే. కానీ ఆ బాల్ నేలకు తగిలిన తర్వాత ఆస్ట్రేలియన్ ఫీల్డర్ వాట్సన్ పట్టుకోవడంతో రోహిత్ శర్మ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. అలాగే శిఖర్ ధావన్ ఇచ్చిన క్యాచ్‌ని వికెట్ కీపర్ వదిలేయడంతో ధావన్ బతికిపోయాడు.