ఇండియా లక్ష్యం... 329

 

ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఇండియా - ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టు లక్ష్యాన్ని 329గా నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు దూకుడుగా ఆరంభించింది. ఒక వికెట్ పడిన తర్వాత నిలకడగా ఆడింది. అయితే 40 ఓవర్లు దాటిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో 328 పరుగుల దగ్గర పరిమితమైంది. మొదట్లో ఆస్ట్రేలియా దూకుడు చూసి 400 పరుగుల మైలు రాయిని దాటుతుందేమో అనిపించింది. అయితే భారత బౌలర్లు చాకచక్యంగా బౌటింగ్ చేసి ఆస్ట్రేలియాని నియంత్రించారు.