బాబుకు సవాలుగా మారిన అనంత టిక్కెట్ వ్యవహారం

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాలుగా మారింది. పార్టీలో సీనియర్ అయిన ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి, శ్రీనివాస్, కెఎం జకీఫుల్లా తదితరులు తమకే టిక్కెట్ ఇవ్వాలంటూ అధినేతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అనంతపురం మాజీ ఎంపి కెఎం సైఫుల్లా తనయుడైన కెఎం జకీఫుల్లా టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. అనంతపురంలో ముస్లిం వర్గానికి గణనీయ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జకీఫుల్లా తిరుగుబాటు చేస్తే అక్కడ పార్టీకి తీరని నష్టం కలుగుతుందనే భయంతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఆయనకు ఇస్తే ప్రభాకర్ చౌదరిలాంటి వ్యక్తులు సహాయ నిరాకరణ చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనంత టిక్కెట్ పై చంద్రబాబునాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu