శశికళకు ఊరట...జైలు నుంచి విడుదల..
Published on: Mon Jun 5, 2017 4:07PM
.jpg)
ఆదాయానికి మించిన కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు స్వల్ప ఊరట లభించింది. నెల రోజుల పాటు ఆమెకు పెరోల్ మంజూరు చేసింది కోర్టు. ఈ సాయంత్రమే జైలు నుంచి ఆమె విడుదల కానున్నారు. దీంతో శశికళకు పెరోల్ మంజూరైన విషయం తెలియగానే ఆమె అనుచరులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


