అగస్టా స్కాం... మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు

 

అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అగస్టా స్కాం డీల్ లో త్యాగికి భారీగా ముడుపులు అందుకున్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. అగస్టా వ్యవహారంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఈడీ... త్యాగికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇలా వాయుసేన అధిపతిగా పనిచేసిన అధికారికి ఈడీ సమన్లు జారీ కావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu