భారత కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తనకు పోటీగా నిలిచిన విపక్షాల అభ్యర్థి, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌పై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. కోవింద్‌కు 65.65 శాతం ఓట్లు రాగా...మీరా కుమార్‌కు 34.35 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. దేశవ్యాప్తంగా 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 4,895 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవింద్‌కు 7,02,644 ఓట్లు, మీరా కుమార్‌కు 3,64,314 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.